Published : 13 Dec 2021 19:52 IST

EPFO: పీఎఫ్‌ చందాదారులా? ఈ గడువులోగా నామినీని ఏర్పాటు చేసుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగులతో పాటు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో). ఇందులో ప్రతి నెలా జమ అయ్యే మొత్తం.. భవిష్యత్‌లో పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఉద్యోగికి ఉపయోగపడుతుంది. పెన్షన్‌ స్కీమ్‌, బీమా సౌకర్యం ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకూ అండగా నిలుస్తోంది. ఇవన్నీ పొందాలంటే.. పీఎఫ్‌ చందాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.

అయితే, చందాదారులు నామినీని సులువుగా యాడ్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం అందిస్తోంది. డిసెంబర్‌ 31లోపు నామినీని వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది. ఈపీఎఫ్‌వో చందాదారుడికి జరగరానిది ఏదైనా జరిగే సందర్భంలో పీఎఫ్‌ మొత్తంతో పాటు, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ స్కీమ్‌ మొత్తాలు నామినీకి చేరుతాయి.

నామినీని ఏర్పాటు చేసుకోవడం ఇలా..
* ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ను (epfindia.gov.in) సందర్శించండి.
* సర్వీస్‌ విభాగంలో ‘ఫర్‌ ఎంప్లాయిస్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
* తర్వాత ‘Member UAN/Online Service (OCS/OTCP)’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
* యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
* అక్కడ ‘మేనేజ్‌’ విభాగంలోని ‘ఈ-నామినేషన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* ‘యెస్‌’పై క్లిక్‌ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వొచ్చు.
* ‘యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌’ ద్వారా నామినీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లను కూడా ఇవ్వొచ్చు.
* ‘సేవ్‌ నామినేషన్‌’పై క్లిక్‌ చేశాక.. ఓటీపీని ఎంటర్‌ చేసి ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని