ఇంటి కొనుగోలు కోసం పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవ‌చ్చు

గృహ నిర్మాణం చేప‌డుతున్న స్థ‌లం పీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఖాతాదారుడు లేదా అతని భార్య పేరిట ఉండాలి

Published : 28 Apr 2021 15:59 IST

ఇంటిని కొనుగోలు చేయడానికి ఒక ఉద్యోగికి పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ ఒక మంచి నిధిగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఆస్తి కొనుగోలు కోసం పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల ప్రకారం, ఇల్లు కొనడానికి లేదా  ఇంటి నిర్మాణానికి  పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఆ స్థ‌లం పీఎఫ్ ఖాతాదారుడు లేదా భాగ‌స్వామి పేరుతో ఉండాలి. ఏదేమైనా, ఆస్తి కొనుగోలు కోసం పీఎఫ్ ఉపసంహరణకు అర్హత పొందడానికి, కనీసం ఐదు సంవత్సరాల నుంచి పీఎఫ్ ఖాతాలో జ‌మ‌చేయాలి. ఈ పీఎఫ్ ఉపసంహరణ సౌకర్యం ప్రైవేటు రంగంలో పనిచేసే ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి అంద‌రు పీఎఫ్, ఈపీఎఫ్‌ ఖాతాదారులు ఆస్తి కొనుగోలు కోసం ప్రావిడెంట్ ఫండ్ పొందేందుకు అర్హులు. ఇది స్థ‌లం కొనుగోలు చేసేందుకు లేదా ఇంటిని నిర్మించేందుకు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. 


పీఎఫ్ ఉపసంహరణ పరిమితి ఆస్తి కొనుగోలు ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది. ప్లాట్లు కొనడానికి, ఉద్యోగి 24 నెలల ప్రాథమిక జీతం, డీఏ లేదా ప్లాట్ వాస్తవ ధర, ఏది తక్కువైతే అది ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమ‌తిత ఉంది.

గృహ కొనుగోలు లేదా గృహ నిర్మాణం కోసం  పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 36 నెలల ప్రాథమిక జీతం, డీఏను ఉపసంహరించుకోవచ్చు లేదా భూమి అసలు ధర లేదా నిర్మాణానికి అవసరమైన మొత్తం, ఏది తక్కువ అయితే అంత మొత్తం తీసుకోవ‌చ్చు. ఏ సందర్భంలోనైనా, పీఎఫ్ ఉపసంహరణ పరిమితి పీఎఫ్‌ / ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 90 శాతానికి మించకూడదు.  గృహ కొనుగోలు లేదా గృహ నిర్మాణానికి పీఎఫ్ తీసుకున్న‌ తరువాత, ఆస్తి పీఎఫ్ ఖాతాదారుడి పేరిట ఉండాలి లేదా ఆస్తిని పీఎఫ్ ఖాతాదారుడు, దాని జీవిత భాగస్వామితో ఉమ్మ‌డిగా కొనుగోలు చేయాలని నిపుణులు చెప్తున్నారు.

గృహ నిర్మాణం చేప‌డుతున్న స్థ‌లం పీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఖాతాదారుడు లేదా అతని భార్య పేరిట ఉండాలి లేదా ఇద్దరికీ ఉమ్మడిగా ఉండాలి. మరే సందర్భంలోనూ, గృహ నిర్మాణానికి పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి లేదు. గృహ రుణం తిరిగి చెల్లించడానికి పీఎఫ్ ఉపసంహరణకు కూడా అనుమతి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని