కోవిడ్ చికిత్స కోసం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చా?
ఒక నెల కన్నా ఎక్కువ లేదా పెద్ద శస్త్రచికిత్స కోసం పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి ఉంది
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ను దీర్ఘకాలిక రిటైర్మెంట్ ఫండ్ కార్పస్‌గా పరిగణిస్తారు, అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిబంధనల ప్రకారం, మెడికల్ ఎమర్జెన్సీ, ఫ్లాట్ లేదా భూమి కొనడం, ఇంటి నిర్మాణం మొదలైన కొన్ని పరిస్థితులలో పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి ఉంది. వైద్య అత్యవసర సమయంలో లేదా చికిత్సకు అధిక ఖర్చు అవుతున్నప్పుడు క్లిష్టమైన సమయంలో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. పీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఖాతాదారుడు కోవిడ్ చికిత్స కోసం కూడా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. వైద్య చికిత్స కోసం పీఎఫ్ / ఈపీఎఫ్ ఖాతాదారుడు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది, వైద్య అత్యవసర పరిస్థితుల్లో జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రుల వైద్యం కోసం కూడా తీసుకోవచ్చు.
మరి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఒక నెల ప్రాథమిక జీతానికి ఆరు రెట్లు లేదా పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి చేసిన నికర డిపాజిట్, వడ్డీ ..ఇందులో ఏది తక్కువ అయితే అంత ఉపసంహరించుకోవచ్చు. వైద్య చికిత్స కోసం లాక్-ఇన్ లేదా నిర్థష్ట కాలం ఉద్యోగం చేసి ఉండాలన్న నిబంధనలు ఏమి వర్తించవు.
కోవిడ్ చికిత్స కోసం కూడా పీఎఫ్ / ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉపసంహరణకు అనుమతి ఉంది. కోవిడ్ కారణంగా పీఎఫ్ ఖాతాదారుడు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఎవరైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు అత్యవసర సమయంలో పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. కానీ దానికోసం ఆసుపత్రి బిల్లులు, చికిత్స వివరాలను చూపించవలసి ఉంటుంది.
ఆసుపత్రిలో ఒక నెల కన్నా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే లేదా పెద్ద శస్త్రచికిత్స కోసం పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి ఉంది. కోవిడ్ -19 వల్ల కూడా ఇంతకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తే, దానికి తగిన ఆధారలు ఉంటేనే పీఎఫ్ తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా