Modi: బ్యాంకులు రూ.5 లక్షల కోట్లు వసూలు చేశాయి: మోదీ

దేశ ఆర్థికాభివృద్ధిలో.. ఉద్యోగ కల్పనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘క్రియేటింగ్‌ సినర్జీస్‌ ఫర్‌ సీమ్‌లెస్‌ క్రెడిట్‌ఫ్లో అండ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన గురువారం ప్రసంగించారు.

Published : 18 Nov 2021 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థికాభివృద్ధిలో.. ఉద్యోగ కల్పనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘క్రియేటింగ్‌ సినర్జీస్‌ ఫర్‌ సీమ్‌లెస్‌ క్రెడిట్‌ఫ్లో అండ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన గురువారం ప్రసంగించారు. బ్యాంకులకు ప్రభుత్వం నుంచి వీలైనంత మద్దతు ఇస్తామని ప్రకటించారు. గత 6-7ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా నేడు బ్యాంకింగ్‌ రంగం బలపడిందన్నారు. మొండిబకాయిల వసూళ్లలో మంచి పురోగతి సాధించిందని ప్రశంసించారు. రూ.5 లక్షల కోట్లకుపైగా బకాయిలను వసూలు చేశాయన్నారు.

ఎన్‌పీఏ, బ్యాంక్‌లకు మూలధనం సమకూర్చడం వంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సరిపడా మూలధనం ఉండటంతోపాటు.. ఎన్‌పీఏల భారం కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దివాల చట్టాలను తీసుకురావడంతోపాటు రికవరీ ట్రైబ్యూనల్స్‌ను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ‘నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ’ ద్వారా రూ.2 లక్షల కోట్లకుపైగా మొండి బకాయిలను పరిష్కరించారన్నారు. ప్రస్తుతం బ్యాంకులు వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు భాగస్వామ్య విధానాలను అనుసరిస్తున్నాయని.. రుణదాతల వలే వ్యవహరించడాన్ని వదిలించుకొన్నాయని మోదీ వివరించారు. బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్లతో దేశ బ్యాలెన్స్‌ షీట్‌ను వృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని