PMSBY: రూ.12తో ప్ర‌మాద బీమా

`పీఎమ్ఎస్‌బీవై` యొక్క క‌వ‌రేజ్ కాలం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 1 నుండి మే 31 వ‌ర‌కు ఉంటుంది. 

Updated : 24 May 2021 12:39 IST

ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) అనేది ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం, వైక‌ల్యానికి సంబంధించి బీమాను అందించే ప‌థ‌కం. ఈ బీమాకు సంబంధించి.. ఈ నెల‌ మే 31 లోపు బ్యాంకులు రూ. 12 ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటాయి. బ్యాంక్ ఖాతాదారుడు ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) ప‌థ‌కంలో చేరేట‌ప్పుడు బ్యాంక్ ఖాతాలో ఆటో డెబిట్‌లో చేర‌డానికి లేదా ప్రారంభించ‌డానికి స‌మ్మ‌తి ఇవ్వ‌డం తప్ప‌నిస‌రి.

ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) ప్రీమియం త‌గ్గింపు గురించి బ్యాంకులు వారి పొదుపు ఖాతాదారుల‌కు ఎస్ఎంఎస్ పంప‌డం మ‌రియు  ఇత‌ర స‌మాచార మార్గాల ద్వారా తెలియ‌జేస్తున్నాయి. `పీఎంఎస్‌బీవై` ప‌థ‌కంలో చేరిన వారికి మాత్ర‌మే బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అవుతుంది. ఒక బ్యాంకులో ధ‌ర‌ఖాస్తును నింప‌డం ద్వారా లేదా బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేయ‌డం ద్వారా కూడా `పీఎంఎస్‌బీవై` ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు.

`పీఎమ్ఎస్‌బీవై` యొక్క క‌వ‌రేజ్ కాలం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 1 నుండి మే 31 వ‌ర‌కు ఉంటుంది. అందువ‌ల్ల ఈ ప‌థకాన్ని కొన‌సాగించాల‌నుకుంటే ప్ర‌తి సంవ‌త్స‌రం మే నెల‌లో పున‌రుద్ధ‌ర‌ణ (రెన్యువ‌ల్‌) ప్రీమియం చెల్లించాలి. ఈ ప‌థ‌కంలో చేరేట‌ప్పుడు బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్‌లో చేర‌డానికి లేదా ప్రారంభించ‌డానికి స‌మ్మ‌తి ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ బీమా ఒక సంవ‌త్స‌రం క‌వ‌ర్ చేస్తుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం బ్యాంక్ ఖాతా రూ. 12 (జీఎస్టీతో స‌హా) క‌ట్ అయి ఆటోమేటిగ్గా బీమా పున‌రుద్ధ‌ర‌ణ అవుతుంది. మీ బ్యాంక్ ఖాతా నుండి సాధార‌ణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం మే 25 - మే 31 మ‌ధ్య క‌ట్ (డెబిట్) అవుతుంది.

బ్యాంకు ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్ల‌లోపు వారంద‌రూ ఈ ప‌థ‌కంలో న‌మోదు చేసుకోవ‌చ్చు. ఒక‌టి లేదా వేరువేరు బ్యాంకుల‌లో ఒక వ్య‌క్తి క‌లిగి ఉన్న బ‌హుళ బ్యాంక్ ఖాతాల విష‌యంలో, వ్య‌క్తి ఒక బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఈ ప‌థ‌కంలో చేర‌డానికి అర్హులు. ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకులు ఈ మొత్తాన్ని తీసివేస్తున్న‌ట్లు మీరు క‌నుగొంటే, మీరు ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించాల‌నుకుంటున్న చోట మిన‌హా మిగ‌తావాటిని సంప్ర‌దించి ఆ బ్యాంకులో ఈ బీమాను తీసివేయించాలి.

`పీఎంఎస్‌బీవై` అనేది ప్ర‌మాద బీమా ప‌థ‌కం, ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణం లేదా వైక‌ల్యం కోసం బీమా అందించ‌బ‌డుతుంది. గుండెపోటు మొద‌లైన స‌హ‌జ కార‌ణాల వ‌ల్ల జ‌రిగే మ‌ర‌ణాల‌కు బీమా క‌వ‌ర్ అందించ‌బ‌డ‌దు. ఈ ప‌థ‌కం కింద రిస్క్ క‌వ‌రేజ్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం మ‌రియు పూర్తి వైక‌ల్యానికి రూ. 2 ల‌క్ష‌లు, పాక్షిక వైక‌ల్యానికి రూ. 1 ల‌క్ష‌, ఖాతాదారుడి మ‌ర‌ణం త‌ర్వాత బీమా చేసిన వ్య‌క్తి నామినీ యొక్క బ్యాంక్ ఖాతాకు బీమా క్లెయిమ్ చెల్లించ‌బ‌డుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని