పీపీఎఫ్‌-ఈఎల్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

పీపీఎఫ్‌-ఈఎల్ఎస్ఎస్ రెండూ ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలు మ‌రి వాటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏమిటో తెలుసుకుందాం....

Published : 18 Dec 2020 17:18 IST

పీపీఎఫ్‌-ఈఎల్ఎస్ఎస్ రెండూ ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలు మ‌రి వాటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏమిటో తెలుసుకుందాం​​​​​​​.

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌), ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్‌) రెండింటిలో ప‌న్ను మిన‌హాయింపుల‌కు అవ‌కాశం ఉన్న ప‌థ‌కాలు. సెక్ష‌న్ 80 సీ కింద ఈ రెండు ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డుల‌కు రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను త‌గ్గింపును పొంద‌వ‌చ్చు.

ఈ రెండు ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించుకునేవారు కేవ‌లం ప‌న్ను ఆదా కోస‌మే కాకుండా, ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెర‌వ‌ర్చుకునే ఉద్దేశ్యంతో ఇందులో చేరుతున్నార‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు వివిధ రంగాల కంపెనీ షేర్ల‌లోకి చేర‌తాయి. వీటికి మూడు సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇవి ఈక్విటీ మార్కెట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి.

  1. పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌కు 15 సంవ‌త్స‌రాల గ‌డువు ఉంటుంది. ఇది ప్ర‌భుత్వ ప‌థ‌కం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. 15 ఏళ్ల త‌ర్వాత కావాల‌నుకుంటే మ‌రింత కాలం పొడ‌గించుకునే అవ‌కాశం ఉంటుంది.

2.పీపీఎఫ్ లో ఏడాది ప్రారంభంలో డిపాజిట్ చేస్తే సంవ‌త్స‌రం మొత్తానికి వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

  1. త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీ రేట్లు ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుతం పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.9 శాతంగా ఉంది.

4.ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.500 నుంచి గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

5.ఏడ‌వ‌ సంవ‌త్స‌రం త‌ర్వాత పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. దీర్ఘ‌కాలీక ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఇది స‌రైన పెట్టుబ‌డి ప‌త‌కం. వ‌డ్డీ, మెచ్యూరిటీపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

6.పీపీఎఫ్ ఖాతాను 15 ఏళ్ల‌కు ముందుగా మూసివేస్తే ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో (అత్య‌వ‌స‌ర వైద్య చికిత్స వంటివి) మాత్ర‌మే ముందుగా మూసివేసే అవ‌కాశం ఉంటుంది.

7.ఈఎల్ఎస్ఎస్ కి లాక్‌-ఇన్ పీరియ‌డ్ మూడేళ్లు. త‌ర్వాత పాక్షికంగా లేదా మొత్తంగా డ‌బ్బును విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

8.ఆర్థిక స‌ల‌హాదారులు ఈ ప‌న్ను మిన‌హాయింపు ప‌థ‌కాల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తారు. దీంతో పెట్టుబ‌డులు అల‌వాటు కావ‌డంతో పాటు త‌క్కువ మొత్తంతో పెట్టుబ‌డులు కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉంటుంది.

9.ఈఎల్ఎస్ఎస్ లో సిప్ పెట్టుబ‌డులకు కూడా మూడేళ్ల లాక్-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది.

10.ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రూ.ల‌క్ష దాటిన దీర్ఘ‌కాలీక పెట్టుబ‌డుల‌కు 10 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఈఎల్ఎస్ఎస్‌కి కూడా ఇది వ‌ర్తిస్తుంది. ఈఎల్ఎస్ఎస్‌లో గ్రోత్‌, డివిడెండ్ రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఈక్విటీ స్కీములకు 10 శాతం డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ట్యాక్స్ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అందుకే ఈక్విటీ ఫండ్ల‌లో డివిడెండ్ కొంత త‌గ్గే అవ‌కాశ‌ముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని