పీపీఎఫ్ VS మ్యూచువ‌ల్ ఫండ్లు... రాబ‌డి ఎందులో ఎక్కువ‌?

వ‌డ్డీ రేట్లు పెరిగిన త‌ర్వాత పీపీఎఫ్ పెట్టుబ‌డులు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారాయి.....

Published : 19 Dec 2020 10:44 IST

వ‌డ్డీ రేట్లు పెరిగిన త‌ర్వాత పీపీఎఫ్ పెట్టుబ‌డులు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారాయి.​​​​​​​

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెరిగాయి. మ‌రి ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు మేలైన‌వా లేదా పీపీఎఫ్ పెట్టుబ‌డులు ఎక్కువ రాబ‌డిని అందిస్తాయా తెలుసుకుందాం. రిస్క్ లేకుండా పెట్టుబ‌డులు పెట్టేవారికి పీపీఎఫ్ స‌రైన ఆప్ష‌న్‌. దీనిపై వ‌డ్డీ రేటు ఇప్పుడు 8 శాతానికి చేరింది. పీపీఎఫ్ పెట్టుబ‌డులు క‌చ్చిత‌మైన రాబ‌డితో భ‌విష్య‌త్తుకు భ‌రోసాగా ఉంటాయి. అయితే భ‌విష్య‌త్తు కోసం ప్ర‌ణాళిక చేసుకుంటున్న‌వారు పీపీఎఫ్ పెట్టుబ‌డులు స‌రిపోతాయా? లేదా మ్యూచువ‌ల్ ఫండ్లు, యులిప్‌ల వంటి మ‌రిన్ని ఆప్ష‌న్ల‌ను ప‌రిశీలించ‌వ్చా? ఆర్థిక నిపుణుల ప్ర‌కారం, ఎవ‌రైతే రిస్క్ తీసుకోకుండా దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగించాల‌నుకుంటున్నారో వారికి పీపీఎఫ్ స‌రైన‌ది. ఇందులో 8 శాతం వ‌డ్డీతోపాటు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. మ్యూచువల్ ఫండ్ల‌లోని డెట్ స్కీముల్లో ప‌న్ను మిన‌హాయించ‌గా వ‌చ్చే రాబ‌డితో పోలిస్తే పీపీఎఫ్ మెరుగైన రాబ‌డుల‌ను ఇస్తుందని చెప్ప‌వ‌చ్చు. దీంతో పాటు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ రాబ‌డిపై ఎలాంటి క‌చ్చిత‌మైన హామీ ఉండ‌దు. అయితే పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌కు రెండు ప‌రిమితులున్నాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. ఒక‌టి దీని మెచ్యూరిటీ గ‌డువు 15 సంవ‌త్స‌రాలు. అయితే 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు వీలుంటుంది. అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం లేనివారు దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల కోసం దీనిని ఎంచుకోవ‌చ్చు. మ‌రొక నిబంధ‌న ఏంటంటే ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే డిపాజిట్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌కు ఇలాంటి ప‌రిమితులు ఉండ‌వు.

అయితే ఇప్పుడు పీపీఎఫ్ లేదా ఈఎల్ఇఎస్ఎస్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో ఏది మేలైన ఆప్ష‌న్ అనేది చాలా మంది సందేహం. సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ప‌న్ను ఆదా చేసుకోవాలంటే పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్ రెండూ స‌రైన‌వి. వ‌య‌స్సు, రిస్క్, లిక్విడిటీ ని బ‌ట్టి ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలో నిర్ణ‌యించుకోవాలి.

సెక్ష‌న్ 112ఏ ప్ర‌కారం ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌పై 10 శాతం ప‌న్ను ఉన్న‌ప్ప‌టికీ, ఈక్విటీ అనుసంధానిత పెట్టుబ‌డులు కావ‌డంతో వీటిపై ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు. స్వ‌ల్ప‌కాలంలో ఏదైనా ఒడుదొడుకులు ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో ఇవి స‌రిదిద్దుకుంటాయి.

పీపీఎఫ్-ఈఎల్ఎస్ఎస్ రాబ‌డి ఎందులో ఎక్కువ ?

పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్ రెండింటిలో ఏక‌కాలంలో ప్ర‌తీ ఏడాది రూ.75 వేలు పెట్టుబ‌డులు పెట్టార‌నుకుందాం. మ‌రో 15 సంవ‌త్స‌రాల పాటు పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8 శాతంగా అంచ‌నా వేస్తే రూ.21,99,321 రాబ‌డి ల‌భిస్తుంది. అదే ఈఎల్ఎస్ఎస్‌లో స‌గ‌టుగా 12 శాతం వ‌డ్డీ అనుకుంటే 15 ఏళ్ల‌కి రూ.31,31,496 ఆశించ‌వ‌చ్చు. ఈ కాలంలో ఒక్కోదానిలో పెట్టుబ‌డులు మొత్తం రూ.11,25,000 చొప్పున‌ ఉంటుంది. అప్పుడే పెట్టుబ‌డులు ప్రారంభించిన‌వారుకొంత రిస్క్ తీసుకొని ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు చేస్తే దీర్ఘ‌కాలికంగా మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు