ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్‌ అయిన ప‌రాస్ డిఫెన్స్ ఐపీఓ

సంస్థ ఈక్విటీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయ‌బ‌డ‌తాయి.

Updated : 23 Sep 2021 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప‌రాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాల‌జీస్ ఐపీఓ రెండో రోజు 30.11 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్‌ అయ్యింది.  ఎక్స్ఛేంజీల్లో అందుబాటులో ఉన్న స‌బ్‌స్క్రిప్ష‌న్ డేటా ప్ర‌కారం 71,40,793 ఈక్విటీ షేర్లకు గాను 21,50,05,885 ఈక్విటీ షేర్ల‌కు ఆఫ‌ర్ బిడ్‌ల‌ను అందుకుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.140.6 కోట్ల విలువైన షేర్ల‌ను జారీ చేస్తున్నారు. ప్ర‌మోట‌ర్లు, ఇప్ప‌టికే ఉన్న వాటాదారులకు చెందిన 17,24,490 షేర్లను విక్రయించనున్నారు.

ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌లో వాటాల‌ను విక్ర‌యించే ప్ర‌మోట‌ర్లు శ‌ర‌ద్ విర్జీ షా, ముంజ‌ల్ శ‌ర‌ద్ షా, వ్య‌క్తిగ‌త విక్ర‌య వాటాదారులు ముంజ‌ల్ షా, శిల్పా అమిత్ మ‌హాజ‌న్‌, అమిత్ న‌వీన్ మ‌హాజ‌న్ ఉన్నారు. కంపెనీ 29,27,485 ఈక్విటీ షేర్ల‌ను యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల‌కు రూ.175 చొప్పున కేటాయించింద‌ని, ఈ లావాదేవీ విలువ రూ.51.23 కోట్ల‌ని బీఎస్ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన స‌ర్క్యుల‌ర్‌లో తెలిపింది. ఇష్యూ ప‌రిమాణంలో 50% అర్హ‌త క‌లిగిన సంస్థాగ‌త కొనుగోలుదారుల‌కు, 35% రిటైల్ పెట్టుబ‌డిదారుల‌కు, మిగిలిన 15% సంస్థేత‌ర పెట్టుబ‌డిదారుల‌కు రిజ‌ర్వ్ చేశారు. ఈ తాజా ఇష్యూ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని మూల‌ధ‌న వ్య‌య అవ‌స‌రాల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి, పెరుగుతున్న వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి, కంపెనీ ద్వారా పొందిన పాత రుణాల‌ను తిరిగి చెల్లించ‌డానికి ఉప‌యోగించనున్నారు.

ఈ కంపెనీ క్లిష్ట‌మైన విస్తృత ఉత్ప‌త్తి పోర్ట్‌ఫోలియోను క‌లిగి ఉండ‌టం, ర‌క్ష‌ణ రంగంలో ఉండ‌టం, బ‌ల‌మైన క్ల‌యింట్ సంబంధాలు కంపెనీకి అద‌న‌పు బ‌లంగా మారాయి. ర‌క్ష‌ణ‌, అంత‌రిక్ష వ్య‌యంపై ప్ర‌భుత్వ ప్రేర‌ణ నుంచి ‘ప‌రాస్ డిఫెన్స్ (స్పేస్ టెక్నాల‌జీస్‌) లిమిటెడ్’ ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌ద‌ని మార్కెట్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఈ కంపెనీ వ్యాపారంతో పోల్చ‌ద‌గిన కంపెనీలు దేశంలో లేక‌పోవ‌డం కూడా ‘ప‌రాస్ డిఫెన్స్‌’కు క‌లిసొచ్చే అంశం. ఈ ప‌రాస్ డిఫెన్స్ ర‌క్ష‌ణ‌, అంత‌రిక్ష యాప్స్ కోసం విస్తృత శ్రేణి ఉత్ప‌త్తులు, ప‌రిష్కారాల‌ను అందిస్తుంది. ప్ర‌భుత్వం ప్రొత్స‌హించే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మాలకు అనుగుణంగా కంపెనీ ఉత్ప‌త్తులు ఉన్నాయ‌ని మార్వాడి షేర్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ విశ్లేష‌కులు తెలిపారు. కంపెనీ విస్తృత‌మైన ర‌క్ష‌ణ‌, అంత‌రిక్ష ఇంజ‌నీరింగ్ ఉత్ప‌త్తులు, ప‌రిష్కారాల రూప‌క‌ల్ప‌న‌, అభివృద్ధి, త‌యారీ, ప‌రీక్ష‌ల్లో నిమ‌గ్న‌మై ఉంది. ఆనంద్ రాఠీ అడ్వైజ‌ర్స్ ఈ ఇష్యూకి లీడ్ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంస్థ ఈక్విటీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయ‌నున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని