వార్షిక డిస్కౌంట్‌తో నెల‌వారీ ప్రీమియం చెల్లించ‌డం ఎలా?

నెలవారీ ప్రీమియంల‌ను స‌మ‌యానికి చెల్లిస్తూ, వార్షిక డిస్కౌంటుల‌నూ పొందే విధంగా ఆటో ప్రీమియం పేమెంట్ స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది......

Updated : 01 Jan 2021 18:52 IST

చాలా మంది ఎల్ఐసీ పాల‌సీల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే నెల‌వారి ప్రీమియం స‌మ‌యానికి చెల్లించ‌డం మ‌ర్చిపోతుంటారు. అందుకోసం ఒకే మొత్తంగా ప్రీమియం చెల్లించ‌డం భార‌మైన‌ప్ప‌టికీ వార్షిక ప్రీమియంను ఎంచుకుంటారు. మ‌రోవైపు వార్షిక ప్రీమియం చెల్లించ‌డం ద్వారా వ‌చ్చే అద‌న‌పు డిస్కౌంటును, నెల‌వారీగా ప్రీమియం చెల్లించే వారు పొంద‌లేరు. అయితే మ‌రి నెల‌వారి ప్రీమియం చెల్లించ‌డం మంచిదా? వార్షికంగా ప్రీమియం చెల్లించ‌డం మంచిదా?

నెలవారీ ప్రీమియంల‌ను స‌మ‌యానికి చెల్లిస్తూ, వార్షిక డిస్కౌంటుల‌నూ పొందే విధంగా ఆటో ప్రీమియం పేమెంట్ స‌ర్వీస్ (ఏపీపీఎస్‌) అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా ఎల్ఐసీ పాల‌సీలో పొందే అన్ని ప్ర‌యోజ‌నాలు చెక్కుచెద‌రకుండా ఉంటాయి.

ఎపీపీఎస్ అంటే ఏమిటి?

ఆటో ప్రీమియం చెల్లింపు సర్వీస్ (ఏపీపీఎస్‌)లో ముందుగా ఎల్ఐసీ వారు ఇచ్చిన మూడు డెట్‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏదో ఒక దానిని ఎంచుకుని నెల‌సరి సిప్ విధానం ద్వారా మ‌దుపు చేయాలి. మీ ప్ర‌స్తుత ఎల్ఐసీ బీమా పాల‌సీని మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోకి అనుసంధానించాలి. గుడువు తేదికి లేదా గ‌డువు తేదీ కంటే 5 రోజుల ముందుగా మీ ఎమ్ఎఫ్ ఫోలియో (త‌గినంత నిధులు ఉన్న‌ప్పుడు) నుంచి ప్రీమియం చెల్లించ‌బ‌డుతుంది.

చెల్లింపు తేదీని గుర్తుంచుకోవలసిన అవసరం లేదు :

మీరు మీ పాల‌సీ ప్రీమియం తేదీని మ‌ర్చిపోయిన ఎపీపీఎస్ సంస్థ‌ ఇంటిగ్రేట‌డ్ చెల్లింపు విధానం ద్వారా మీ ప్రీమియం స‌మ‌యానికి చెల్లిస్తారు. కావున పాల‌సీ ర‌ద్దు అయ్యే అవ‌కాశం ఉండదు.

ప్రీమియంపై డిస్కౌంట్, సిప్‌తో లాభం :

నెలసరి చెల్లింపు సౌలభ్యంతో పాటు, సిప్ రాబ‌డుల‌ను పొంద‌డం ద్వారా వార్షిక డిస్కౌంటుల‌ను పొంద‌వ‌చ్చు. రిక‌రింగ్ డిపాజిట్‌ల ద్వారానూ అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ ప్రీమియం చెల్లించ‌డానికి కావ‌ల‌సిన మొత్త‌న్ని రిక‌రింగ్ ఖాతా నుంచి తీసుకోవ‌డానికి గ‌డువు తేది గుర్తించుకోవాల్సి వ‌స్తుంది.

ఎందులో పెట్టుబడి పెట్టాలి?

ఏపీపీఎస్‌ ప్రయోజనాలను ఆస్వాదించడానికి మూడు ర‌కాల డెట్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.1.ఎల్ఐసీ ఎమ్ఎఫ్‌ లిక్విడ్ ఫండ్లు, 2.ఎల్ఐసీ ఎమ్ఎఫ్ సేవింగ్స్‌ ఫండ్లు, 3.ఎల్ఐసీ ఎమ్ఎఫ్ బ్యాంకింగ్‌, పీఎస్‌యూ డెట్ ఫండ్లు. ఈ మూడు ప‌థ‌కాల‌లో ఎటువంటి క్యాపింగ్ గాని లోడింగ్ గాని లేదు. అందువ‌ల‌న పెట్టుబ‌డిదారులు ఎప్పుడైనా నిధుల‌ను విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఎంత పెట్టుబడి పెట్టాలి?

ఫోలియోను సృష్టించటానికి ఇచ్చిన‌ మూడు ఫండ్లలో ఏదైనా ఒక దానిలో రూ. 5,000 మొద‌టి పెట్టుబ‌డి పెట్టాలి. నెల‌స‌రీ సిప్ రూ. 500, రూ.1000, రూ. 1500 లుగా ఉంటుంది. వార్షిక ప్రీమియంను 12 తో భాగించ‌గా వ‌చ్చిన మొత్తం త‌దుప‌రి గ‌రిష్ట రూ. 500 విలువ‌కు లెక్కించి జ‌మ‌చేయాలి. సిప్ మొత్తం నెలవారీ ప్రీమియంకు సమానంగా ఉండాలి. క‌నీస నెల‌వారీ సిప్ రూ. 500.

లిక్విడిటీ సంగతేంటి ?

లాక్-ఇన్ పిరియ‌డ్‌, నిష్క్రమణ లోడ్లు లేనందున, పెట్టుబడుల అనంత‌రం న‌గ‌దును తీసివేయవచ్చు. కానీ గడువు తేదీలో ప్రీమియం చెల్లించ‌డానికి త‌గిన బ్యాలెన్స్‌ను నిర్వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఏ ర‌క‌మైన‌ ఎల్‌ఐసీ పాల‌సీలు లింక్ చేసుకోవ‌చ్చు?

ర‌ద్ద‌వ‌డాన‌కి సిధ్ధంగా వున్న‌ ఎస్ఎస్ఎస్ లేదా నెల‌వారి ప్రీమియం క‌లిగి వున్న పాల‌సీలు, ఒకే ప్రీమియం, యులిప్స్‌, ఆరోగ్య బీమా పథకాలు వంటివి మిన‌హాయించి, రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ప్రీమియం కలిగిన అన్ని పాల‌సీలకు వ‌ర్తిసుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని