విదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెల్లింపులను

కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం నిమిత్తం విదేశీ తయారీదార్లకు భారతీయ నివాసితులు లేదా డిస్ట్రిబ్యూటర్లు చెల్లించే మొత్తాలను ‘రాయల్టీ’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated : 03 Mar 2021 10:37 IST

రాయల్టీగా పరిగణించలేం సుప్రీంకోర్టు

దిల్లీ: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం నిమిత్తం విదేశీ తయారీదార్లకు భారతీయ నివాసితులు లేదా డిస్ట్రిబ్యూటర్లు చెల్లించే మొత్తాలను ‘రాయల్టీ’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో కాపీరైట్‌ వినియోగానికి చెల్లించే మొత్తాన్ని రాయల్టీగా భావించలేమని, భారత్‌లో పన్ను విధించలేమని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన బెంచ్‌ తీర్పు చెప్పింది. ఆదాయపు పన్ను విభాగం దాఖలు చేసుకున్న అప్పీలును కొట్టివేసిన సుప్రీంకోర్టు, మదింపుదార్ల అప్పీళ్లకు అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని