FASTag parking service: దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సేవలు!

డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కొత్త సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టోల్‌గేట్ల వద్ద వినియోగిస్తున్నట్లుగా పార్కింగ్‌ స్థలాల్లోనూ కార్లకు ఫాస్టాగ్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది....

Published : 13 Sep 2021 22:12 IST

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కొత్త సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టోల్‌గేట్ల వద్ద వినియోగిస్తున్నట్లుగా పార్కింగ్‌ స్థలాల్లోనూ కార్లకు ఫాస్టాగ్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఇప్పటికే దిల్లీ మెట్రో పార్కింగ్‌ స్థలాల్లో ప్రారంభించింది. ద్విచక్రవాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పేటీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సేవల్లో అక్వైరింగ్‌ బ్యాంక్‌గా వ్యవహరించే పేటీఎం.. కావాల్సిన లావాదేవీలన్నింటినీ పూర్తి చేయనుంది.

జూన్ నాటికి కోటి ఫాస్టాగ్‌లను జారీ చేసిన తొలి బ్యాంక్‌గా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది. జూన్‌ 2021 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశారు. షాపింగ్‌ మాళ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లో ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సేవలను ప్రారంభించే దిశగా సంబంధిత యంత్రాంగాలతో చర్చిస్తున్నామని పేటీఎం వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని