Paytm GMV: పేటీఎం స్థూల విక్రయాల విలువ రూ.1.96 లక్షల కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ‘స్థూల విక్రయాల విలువ(జీఎంవీ)’ రూ.1,95,600 కోట్లుగా నమోదైంది...

Updated : 22 Nov 2021 14:10 IST

దిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ‘స్థూల విక్రయాల విలువ(జీఎంవీ)’ రూ.1,95,600కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది నమోదైన రూ.94,700కోట్లతో పోలిస్తే రెండింతల వృద్ధి రికార్డయింది. ఈ కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తర్వాత.. కార్యకలాపాల పనితీరుకు సంబంధించిన నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి.

పేటీఎం యాప్‌ లేదా సంస్థ అందిస్తున్న ఇతర ఉత్పత్తుల ద్వారా వ్యాపారులకు చెల్లించే మొత్తాన్ని కంపెనీ జీఎంవీగా పేర్కొంటోంది. దీంట్లో వినియోగదారుల మధ్య జరిగే నగదు బదిలీ వంటి లావాదేవీలను మినహాయిస్తారు. క్రితం ఏడాది అక్టోబరు నెలలో రూ.36,000కోట్లుగా నమోదైన జీఎంవీ గత నెలలో 131 శాతం పెరిగి రూ.83,200 కోట్లకు పెరిగింది.

ఇక ఏటా పేటీఎం ద్వారా లావాదేవీలు జరపుతున్న వినియోగదారుల సంఖ్య జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 33 శాతం పెరిగి 5.7 కోట్లకు చేరింది. ఇక క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో మంజూరు చేసిన రూ.210కోట్ల రుణాలు.. 500 శాతం పెరిగి రూ.1,260కోట్లకు చేరాయి. ఒక్క అక్టోబరులో రూ.630కోట్ల రుణాలు మంజూరయ్యాయి. రుణాల సంఖ్య సైతం భారీగా పెరిగి 28.41 లక్షలకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని