పేటీఎం క్రెడిట్ కార్డులు‌.. ప్ర‌యోజ‌నాలు

మొబైల్ వాలెట్, డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం క్రెడిట్ కార్డు మార్కెట్‌పై దృష్టిసారించింది. అందుకే సరికొత్త కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకురావాలని యోచిస్తోంది. పేటీఎం ఇప్పటికే ఈ అంశంపై బ్యాంకులతో చర్చిస్తోంది. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 లక్షల క్రెడిట్..

Updated : 01 Jan 2021 19:30 IST

మొబైల్ వాలెట్, డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం క్రెడిట్ కార్డు మార్కెట్‌పై దృష్టిసారించింది. అందుకే సరికొత్త కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకురావాలని యోచిస్తోంది. పేటీఎం ఇప్పటికే ఈ అంశంపై బ్యాంకులతో చర్చిస్తోంది. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 లక్షల క్రెడిట్ కార్డులను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే 12-18 నెలల కాలంలో ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

పేటీఎం తన యాప్ ద్వారా కస్టమర్లకు సరికొత్త డిజిటల్ అనుభూతిని కలిగించాలని యోచిస్తోంది. వినియోగ‌దారులు వారి కార్డుపై పూర్తి నియంత్ర‌ణ క‌లిగి ఉంటారు. కొత్త క్రెడిట్ కార్డు కోసం పేటీఎం కార్డు జారీ సంస్థలతో జతకట్టనుంది. ఆ కంపెనీలో భాగస్వామ్యం ద్వారా కొత్త పేటీఎం క్రెడిట్ కార్డులను తీసుకురాబోతోంది.

పేటీఎం క్రెడిట్ కార్డులో ఇన్‌స్టంట్ వన్ టచ్ ఫీచర్స్ ఉంటాయి. వీటి సాయంతో సెక్యూరిటీ పిన్ నెంబర్, అప్‌డేట్ అడ్రస్, బ్లాక్ కార్డు, ఇష్యూ డూప్లికేట్ కార్డు, కార్డు బిల్లు మొత్తం వంటి సర్వీసులు అన్నింటినీ పొందొచ్చు. ఇంకా కార్డును ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. కార్డుపై అంతర్జాతీయ లావాదేవీలను నిలిపివేయ‌వ‌చ్చు.

ఇంకా పేటీఎం క్రెడిట్ కార్డుపై ఇన్సూరెన్స్ సేవలు కూడా పొందొచ్చు. పేటీఎం యాప్ ద్వారానే ఈ సర్వీసులు అన్నీ కూడా ల‌భిస్తాయి. పేటీఎం క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవడం నుంచి కార్డు జారీ వరకు అన్ని సేవ‌ల‌ను యాప్ ద్వారానే పొంద‌వ‌చ్చు. ఇంకా క్యాష్‌బ్యాక్స్, రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటివి కూడా ఉంటాయ‌ని తెలిపింది. రివార్డు పాయింట్లను ఎప్పుడైనా ఉప‌యోగించుకునే సౌక‌ర్యం ఉంటుంది, వీటికి ఎటువంటి గ‌డువు ఉండ‌బోదు. పేటీఎం యాప్‌లో ఈ రివార్డు పాయింట్లతో షాపింగ్ చేయొచ్చు.

అమెరికా వంటి మార్కెట్లలో 320% తో పోలిస్తే, భార‌త‌ క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో విస్త‌ర‌ణ‌ ప్రస్తుతం 3 శాతం మాత్రమే. ఇ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నియో నియో-బ్యాంకింగ్ వంటి విభాగాలు ప్రీ-పెయిడ్, ఫారెక్స్, క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ద‌మ‌య్యాయి. భార‌త్‌లో ఉన్న‌ క్రెడిట్ కార్డ్ వ్యాపార అంతరాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

మొబిలిటీ సంస్థ ఓలా కూడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో క్రెడిట్ కార్యకలాపాల పొడిగింపుగా తన వినియోగదారులకు ‘ఓలామనీ’ క్రెడిట్ కార్డును అందిస్తుంది, ఇది క్రెడిట్ వినియోగదారులను ఆక‌ర్షిస్తుంది.

భారతదేశం తాజా యునికార్న్, ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ప్రొవైడర్, రేజర్‌పే గత సంవత్సరం తన కార్పొరేట్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది . ఇటీవల ఈ వ్యాపారాన్ని కొత్త వ్యాపారాలు, కార్పొరేట్‌లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని