పేటీఎం లావాదేవీల‌కు ఛార్జీలు

మొబైల్ వాలెట్ పేటీఎం లోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు లేదా మీ ఇ-వాలెట్ నుంచి డబ్బును బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేటప్పుడు మీరు చెల్లించాల్సిన అన్ని ఛార్జీల జాబితాను పేటీఎం విడుదల చేసింది. క్రెడిట్ కార్డును ఉపయోగించి నెలలో రూ.10,000 కంటే ఎక్కువ డబ్బును యాడ్ చేసేందుకు మొదటిసారిగా వినియోగ‌దారులు ఛార్జీ చెల్లించాలి..

Published : 18 Dec 2020 15:48 IST

మొబైల్ వాలెట్ పేటీఎం లోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు లేదా మీ ఇ-వాలెట్ నుంచి డబ్బును బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేటప్పుడు మీరు చెల్లించాల్సిన అన్ని ఛార్జీల జాబితాను పేటీఎం విడుదల చేసింది. క్రెడిట్ కార్డును ఉపయోగించి నెలలో రూ.10,000 కంటే ఎక్కువ డబ్బును యాడ్ చేసేందుకు మొదటిసారిగా వినియోగ‌దారులు ఛార్జీ చెల్లించాలి.

నెల‌కు రూ. 10,000 కంటే తక్కువ లావాదేవీలు ఉచితంగా చేయవచ్చు. రూ. 10,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం 1.75%, జిఎస్‌టీని పేటీఎం వసూలు చేస్తుంది. ఉదాహరణకు, ఒక నెలలో పేటీఎం వాలెట్‌కు మొద‌టిసారిగా రూ.12,000 క్రెడిట్ కార్డు నుంచి యాడ్ చేస్తే దానిపై రూ.240 ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అప్పుడు మీ క్రెడిట్ కార్డు నుంచి రూ.12,240 డెబిట్ అవుతుంది. తదుపరి లావాదేవీలు కూడా తదనుగుణంగా ఛార్జీలు ప‌డ‌తాయి.

డెబిట్ కార్డు ఉపయోగించి లేదా యుపిఐ ద్వారా వాలెట్‌లోకి డ‌బ్బును యాడ్ చేయ‌డం ద్వారా పేటీఎం సేవా ఛార్జీలు వ‌ర్తించ‌వ‌చ్చు. పేటీఎం ద్వారా కొనుగోలు చేయ‌డం ద్వారా ఎటువంటి ఛార్జీలు లేవు. అదేవిధంగా పేటీఎం నుంచి మ‌రో పేటీఎంకి ట్రాన్స‌న్ఫ‌ర్ చేస్తే కూడా ఎటువంటి ఛార్జీల్లేవు. అయితే పేటిఎం నుంచి పేటీఎం బ్యాంక్‌కు లేదా ఇత‌ర బ్యాంకుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే 5 శాతం రుసుములు ఉంటాయి.

ప్రస్తుతం వ్యాపారులకు మొబైల్ చెల్లింపుల్లో 54% మార్కెట్ వాటాను కలిగి ఉన్న మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం ఇటీవల వ్యాపారుల కోసం ఆల్ ఇన్ వన్ క్యూఆర్‌ను ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని