SBI: పెన్షనర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌... లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇక ఏ బ్రాంచ్‌లోనైనా

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పెన్షనర్లకు పెన్షన్ సర్వీస్ కోసం వెబ్ సైటును పునరుద్ధరించింది.

Published : 22 Sep 2021 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పింఛన్‌దారులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెన్షనర్లు ఇకపై ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు కల్పించింది. పెన్షనర్లకు ఉద్దేశించిన పెన్షన్‌ సేవా పోర్టల్‌ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయం తీసుకొచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను సులువుగా పొందే వెసులుబాటును కల్పించామని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఎస్‌బీఐ సేవా పోర్టల్‌ అందించే సేవలు

* పెన్షనర్లు ఎస్‌బీఐ పెన్షన్ సేవా పోర్టల్ ద్వారా వారి పెన్షన్ స్లిప్/ ఫారం-16ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్స్ వారి పెన్షన్ లావాదేవీల వివరాలను చూడొచ్చు.

* ఎరియర్స్‌ బ్యాలన్స్ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* కస్టమర్స్ తమ లైఫ్ సర్టిఫికెట్ స్థితిని తెలుసుకోవచ్చు. 

పెన్షనర్లు తమ పెన్షన్ ప్రొఫైల్ వివరాలను కూడా సులభంగా చూడొచ్చు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవలు

* పెన్షన్‌ చెల్లింపు వివరాలతో పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు ఎస్‌బీఐ సందేశాలను పంపుతుంది.

* మీరు మీ పెన్షన్ స్లిప్పును ఈ-మెయిల్/ పెన్షన్ చెల్లింపు శాఖ ద్వారా పొందొచ్చు.

* జీవన్ ప్రమాణ్‌ సౌకర్యం బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది.

* పెన్షనర్లు ఎస్‌బీఐకి చెందిన ఏదైనా బ్యాంక్‌ శాఖలో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించొచ్చు.

ఫిర్యాదుల కోసం..
1. పెన్షన్‌ సంబంధిత సేవల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను support.pensionseva@sbi.co.inకి ఈ-మెయిల్ పంపొచ్చు. లేదా UNHAPPY అని 80082 02020కి ఎస్సెమ్మెస్‌ చేయొచ్చు.

2. 24x7 కస్టమర్‌కేర్‌ సర్వీస్ ద్వారా 1800 425 3800/1800 112 211 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

3. బ్యాంకు వెబ్‌సైట్‌ bank.sbi/dgm లేదా.. ఈమెయిల్‌ అడ్రస్‌లు customer@sbi.co.in/gm.customer@sbi.co.in కు మెయిల్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని