Real Estate: బంగారం, డిపాజిట్ల కంటే..స్థిరాస్తుల కొనుగోలుకే మొగ్గు!
ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారు.. బిల్డర్ల నుంచి రాయితీలు, కొన్ని ఉచితాలు, చెల్లింపుల్లో వెసులుబాట్లలాంటివి కోరుకుంటున్నారని హౌసింగ్.కామ్, నరెడ్కో విడుదల చేసిన ఒక సర్వేలో వెల్లడయ్యింది....
రాయితీలు, ఉచితాలపై ఆసక్తి
నరెడ్కో, హౌసింగ్.కామ్ సర్వేలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారు.. బిల్డర్ల నుంచి రాయితీలు, కొన్ని ఉచితాలు, చెల్లింపుల్లో వెసులుబాట్లలాంటివి కోరుకుంటున్నారని హౌసింగ్.కామ్, నరెడ్కో విడుదల చేసిన ఒక సర్వేలో వెల్లడయ్యింది. స్థిరాస్తులు ఒక నమ్మకమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నవారే అధికంగా ఉంటున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 43% స్థిరాస్తుల కొనుగోలుకు మొగ్గు చూపగా.. 20% మంది వరకు షేర్లలో, 19% ఫిక్స్డ్ డిపాజిట్లు, 18% బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. గతేడాది నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఈసారి ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారంపై మదుపు చేసే వారి సంఖ్య తగ్గింది. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల్లో స్థిరాస్తులు కొనేందుకు సులభమైన చెల్లింపు విధానాలు ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతం బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్‌తో విక్రయాలు జరుపుతున్నారని, అమ్ముడవని యూనిట్లు ఎక్కువగా ఉన్న వారు.. పలు ఉచితాలు, ఇతర డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందాని తెలిపారు. కొవిడ్ తర్వాత చాలామంది సొంత ఇంటి గురించి ఆలోచిస్తున్నారని, ఇప్పటికే ఇల్లు/ఫ్లాట్ ఉన్నవారు కాస్త పెద్ద ఇంటి కోసం చూస్తున్నారని హౌసింగ్.కామ్ గ్రూపు సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. ధరలు అందుబాటులో ఉండటంతో పాటు, వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కలిసివస్తోందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!