Petrol Diesel Price Hike: ఆగని పెట్రో మంట..వరుసగా ఐదోరోజూ పెరిగిన ధరలు!

దిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది. చమురు విక్రయ సంస్థలు వరుసగా నాలుగోరోజూ ఇంధన ధరల్ని పెంచాయి. ఆదివారం (03-10-2021) లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల వరకు పెరిగాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.39, డీజిల్‌ రూ.90.77కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.108.43, రూ.98.48గా ఉన్నాయి.

తాజా పెంపుతో దేశవ్యాప్తంగా  పెట్రోలు, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత పది రోజుల్లో ఎనిమిది సార్లు చమురు సంస్థలు ధరల్ని సవరించాయి. తాజా ధరల పెంపు పరంపర సెప్టెంబరు 24 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.1.25 పెరగ్గా.. డీజిల్‌  రూ.2.15 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలే.. దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమని చమురు విక్రయ సంస్థలు చెబుతున్నాయి.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           106.51                 99.04

విజయవాడ           108.49                 100.46

విశాఖపట్నం          107.60                 99.60

దిల్లీ                  102.39                 90.77

ముంబయి            108.43                 98.48

చెన్నై                  100.01                95.31

బెంగళూరు            105.95                 97.10


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్