Petrol Diesel Price Hike : వరుసగా రెండోరోజూ పెరిగిన పెట్రో ధరలు!

 దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. శుక్రవారం (01-10-2021)  లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 32 పైసల వరకు పెరిగింది....

Published : 01 Oct 2021 10:25 IST

దిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. శుక్రవారం (01-10-2021)  లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 32 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.89, డీజిల్‌ రూ.90.17కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.107.95, రూ.97.84గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే దేశీయంగా ఇంధన ధరల పెంపునకు కారణం. తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ సహా పలు ప్రాంతాల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. కరోనా ఆంక్షల నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తోంది. అన్ని రంగాల్లో సాధారణ కార్యకలాపాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చమురుకు గిరాకీ పెరిగింది. మరోవైపు ఉత్పత్తిలో సమస్యలు సైతం ధరల పెరుగుదలకు దోహదం చేశాయి. అయితే, గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతామని చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ ప్రకటించడంతో గురువారం ఫ్యూచర్‌ మార్కెట్‌లో చమురు ధరలు కాస్త తగ్గాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర గతవారపు 80 డాలర్ల గరిష్ఠం నుంచి దిగివచ్చి 78.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 74.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           106.00                 97.46

విజయవాడ           108.20                 100.05

విశాఖపట్నం          107.35                 99.21

దిల్లీ                  101.89                 90.17

ముంబయి            107.95                 97.74

చెన్నై                  99.58                 94.74

బెంగళూరు            105.44                95.70

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని