Petrol Diesel Price Hike : వరుసగా మూడోరోజూ ఎగబాకిన పెట్రో ధరలు!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. శనివారం (02-10-2021) లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల వరకు పెరిగాయి....

Updated : 02 Oct 2021 10:05 IST

దిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. శనివారం (02-10-2021) లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల వరకు పెరిగాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.14, డీజిల్‌ రూ.90.48కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.108.15, రూ.98.12గా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా చమురు విక్రయ సంస్థలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో లీటర్‌ డీజిల్‌ ధర సైతం ధర రూ.100 దాటింది. కరోనా ఆంక్షల నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తోంది. అన్ని రంగాల్లో సాధారణ కార్యకలాపాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చమురుకు గిరాకీ పెరిగింది. మరోవైపు ఉత్పత్తిలో సమస్యలు సైతం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           106.26                 98.72

విజయవాడ           108.57                 100.45

విశాఖపట్నం          107.19                 99.14

దిల్లీ                  102.14                 90.47

ముంబయి            108.19                 98.16

చెన్నై                  99.80                 95.02

బెంగళూరు            105.69                96.02

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని