Petrol Diesel Prices : హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ రూ.105

దేశంలో పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజైన ఆదివారమూ పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా లీటరుకు మరో 35 పైసల చొప్పున పెంచారు....

Updated : 17 Oct 2022 14:32 IST

దిల్లీ: దేశంలో పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజైన ఆదివారమూ పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా లీటరుకు మరో 35 పైసల చొప్పున పెంచారు. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.107.59, డీజిల్‌ రూ.96.32కి చేరింది. ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.113.46, రూ.104.38గా ఉంది. ఒక్క కోల్‌కతా మినహా దాదాపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 మార్క్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.105కి చేరింది.

గతేడాది మే 5 నుంచి.. అంటే దాదాపు 18 నెలల్లో లీటరు పెట్రలు పైన మొత్తం రూ.36, లీటరు డీజిలుపైన దాదాపు రూ.27 మేర పెంచారు. లీటరు పెట్రోల్‌పై రూ.32.9, డీజిలుపై రూ.31.8 చొప్పున కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇంధన ధరల పెరుగుదలకు కారణం.  

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           111.91                 105.08

విజయవాడ           113.93                 106.50

విశాఖపట్నం          113.23                 105.80

దిల్లీ                  107.59                  96.32

ముంబయి            113.46                 104.38

చెన్నై                 104.52                 100.59

బెంగళూరు            110.98                 101.86

కోల్‌కతా               108.11                  99.43

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని