Petrol: 16 రోజుల్లో రూ. 4 పెంపు 

మే నెలలో ఎండ వేడితో పాటు ఇంధన ధరలు మండిపోయాయి. వరుస పెంపులతో వినియోగదారుల గుండెలు గుబేలన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్‌ ధర ఏకంగా సెంచరీ దాటేయడంతో

Published : 31 May 2021 10:28 IST

దిల్లీ: మే నెలలో ఎండ వేడితో పాటు ఇంధన ధరలు మండిపోయాయి. వరుస పెంపులతో వినియోగదారుల గుండెలు గుబేలన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్‌ ధర ఏకంగా సెంచరీ దాటేయడంతో వాహనం బయటకు తీయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నెలలో చమురు సంస్థలు 16 సార్లు  ఇంధన ధరలను పెంచాయి. మొత్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ. 4 వరకు పెరిగాయి.

మే 3 తర్వాత నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. సోమవారం కూడా చమురు సంస్థలు పెట్రోల్‌ ధర 28-29 పైసలు, డీజిల్‌ ధరను 26-28 పైసల వరకు పెంచాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.23కు చేరగా.. డీజిల్‌ ధర 85.15గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర గత వారమే సెంచరీ కొట్టగా.. నేడు రూ. 100.47కు చేరింది. అక్కడ డీజిల్‌ ధర రూ. 92.45గా ఉంది.

మొత్తంగా ఈ నెలలో లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ. 3.83 పెంచగా.. డీజిల్‌ ధర రూ. 4.42 పెరిగింది. వ్యాట్‌, స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ ధరలను రోజువారీగా సవరిస్తుంటారు.  

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..

దిల్లీ: పెట్రోల్‌ రూ. 94.23, డీజిల్‌ రూ. 85.15

ముంబయి: పెట్రోల్‌ రూ. 100.47, డీజిల్‌ రూ. 92.45

కోల్‌కతా: పెట్రోల్‌ రూ. 94.25, డీజిల్‌ రూ. 88.00

చెన్నై: పెట్రోల్‌ రూ. 95.76, డీజిల్‌ రూ. 89.90

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ. 97.93, డీజిల్‌ రూ. 92.83

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని