Petrol Prices: స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఎంతంటే?

దాదాపు గత నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం విశేషం....

Updated : 17 Oct 2022 14:36 IST

ముంబయి: దాదాపు గత నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం విశేషం. లీటర్‌ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీలో అక్టోబర్‌ కాంట్రాక్టుకు బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది.

జులై 18 నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఒక నెల పాటు రోజు విడిచి రోజు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44, డీజిల్‌ ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.

వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఇలా ఉన్నాయి. (లీటర్‌ ధర రూ.లలో)

నగరం        పెట్రోల్‌         డీజిల్‌

హైదరాబాద్‌    105.69        97.15

దిల్లీ           101.64        89.07

కోల్‌కతా       101.93        92.13

ముంబయి     107.66        96.64

చెన్నై          99.32        93.66

బెంగళూరు     105.13        94.49

లఖ్‌నవూ       98.70        89.45


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని