Petrol price: సెంచరీ దాటినా ఆగని పరుగు!
ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.76.......
దిల్లీ: ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచారు. ధరల పెంపు ఆరు రోజుల్లో ఇది మూడోసారి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.76, డీజిల్ ధర రూ.93.70కి చేరింది. మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్, జోగులాంబ, కుమురం భీం, నిర్మల్ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీలో అనంతపూర్, చిత్తూరు, తూర్పు గోదావరి, విజయవాడ, గుంటూరులోనూ లీటర్ పెట్రోల్ ధర వందకు చేరింది.
వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25, డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్ రేటు రూ.85.95గా ఉన్నాయి. చైన్నైలో లీటర్ పెట్రోల్ రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లఖ్‌నవూలో రూ.92.29, పట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40కు చేరింది. మరో వైపు డీజిల్ లీటర్ ధర చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పట్నాలో రూ.91.24, లఖ్‌నవూలో రూ.86.35కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్ ధర వందకు చేరువైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు