Petrol: హైదరాబాద్‌లో రూ.100కు చేరువలో..

దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. వరుస పెంపులతో చుక్కలను తాకుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు లీటర్‌ పెట్రోల్‌పై 31

Updated : 11 Jun 2021 14:09 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. వరుస పెంపులతో చుక్కలను తాకుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు లీటర్‌ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102 దాటింది. ఇక దిల్లీలో రూ. 95.85కి చేరింది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 94.14, దిల్లీలో రూ. 86.75గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.100కు చేరువైంది. 

ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లద్దాఖ్‌లోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ జిల్లాలో ఏకంగా రూ. 106.94కు చేరింది. దేశంలో ఇదే అత్యధికం. ఈ ప్రాంతంలో డీజిల్‌ ధర కూడా వంద రూపాయలకు చేరువై రూ. 99.80గా ఉంది. మే 4 నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అప్పటి నుంచి 23 సార్లు ధరలను సవరించగా.. పెట్రోల్‌పై రూ.6 వరకు పెరగడం గమనార్హం. వ్యాట్‌, స్థానిక పన్నులను బట్టి చమురు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు(లీటర్‌ చొప్పున) ఇలా..

దిల్లీ: పెట్రోల్‌ రూ. 95.85, డీజిల్ రూ. 86.75

ముంబయి:  పెట్రోల్‌ రూ. 102.04 , డీజిల్ రూ. 94.15

కోల్‌కతా: పెట్రోల్‌ రూ. 95.80 , డీజిల్ రూ. 89.60

చెన్నై: పెట్రోల్‌ రూ.9 7.19 , డీజిల్ రూ. 91.42

హైదరాబాద్‌:  పెట్రోల్‌ రూ. 99.62, డీజిల్ రూ. 94.57


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని