Remdesivir: రూ.899లకే!

క్యాడిల్లా హెల్త్‌కేర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా బ్రాండ్‌లు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌(100mg/vial) ధరను తగ్గించాయి

Updated : 17 Apr 2021 20:16 IST

ప్రభుత్వం సూచన మేరకు ధర తగ్గించిన ఫార్మా కంపెనీలు

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా  కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడగా, బయట మార్కెట్‌లో దీన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌ఏపీపీఏ) ఫార్మా కంపెనీలను కోరగా,  అందుకు ఆయా కంపెనీలు అంగీకరించాయి.

క్యాడిల్లా హెల్త్‌కేర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా బ్రాండ్‌లు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌(100mg/vial) ధరను తగ్గించాయి. ‘ప్రభుత్వ జోక్యంతో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ధరను ఫార్మా కంపెనీలు తగ్గించాయి. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో చేతులు కలిపి తమవంతు సాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు’’ అని కేంద్ర మంత్రి ముఖేశ్‌ ఎల్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

రెమ్‌డిసివర్‌ ధర తగ్గిన తర్వాత ఇలా..

ఔషధ కంపెనీ పాత ధర కొత్త ధర
క్యాడిల్లా హెల్త్‌కేర్‌ రెమ్‌డ్యాక్‌(100 mg/vial) రూ.2,800 రూ.899
సిన్‌జీన్‌ ఇంటర్నేషనల్‌ రెమ్‌విన్‌ రూ.3,950 రూ.2,450
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రెడిక్స్‌ రూ.5,400 రూ.2,700
మైలాన్‌ రూ.4,800 రూ.3,400
జూబ్లియంట్‌ జెనరిక్స్‌ రూ.4,700 రూ.3,400
హెటిరో హెల్త్‌కేర్‌ కొవిఫర్‌ రూ.5,400 రూ.3,490
సిప్లా సిప్రిమి రూ.4000 రూ.3000

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని