ఫోన్‌పే క‌రోనావైర‌స్ పాల‌సీ వివ‌రాలు

ఫోన్‌పే కరోనా కేర్ బీమా పాలసీ కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే వ‌ర్తిస్తుంది

Published : 27 Dec 2020 14:40 IST

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో “కరోనా కేర్” అనే బీమా పాలసీని ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారి బారినపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వారి కోసం ఈ బీమా పాలసీని తీసుకొచ్చినట్లు ఫోన్‌పే తెలిపింది.

కేవలం రూ. 156 ప్రీమియంతో రూ. 50,000 హామీ మొత్తాన్ని సంస్థ అందిస్తుంది. ఈ పాలసీ 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే బీమా కవరేజీని అందిస్తుంది. ఇది కోవిడ్ -19 కి చికిత్స అందించే ఏ ఆసుపత్రిలోనైనా చెల్లుతుంది. చికిత్సకు అయ్యే ఖర్చును భరించడంతో పాటు, ప్రీ-హాస్పిటలైజేషన్, పోస్ట్-కేర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఒక నెల ఖర్చులను కూడా పాలసీ అందిస్తుంది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేయడంతో ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలియందే. దీంతో పాలసీని తీసుకుకోవానుకునే వారికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆన్ లైన్ ద్వారా పాలసీని జారీ చేస్తున్నారు.

ఫోన్‌పే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, అందులో మై మనీ విభాగంలోకి వెళ్లి వినియోగదారులు పాలసీని కొనుగోలు చేయవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించిన వెంటనే పాలసీ పత్రాలు ఫోన్‌పే యాప్ ద్వారా తక్షణమే జారీ అవుతాయి.

పాలసీ పత్రం ప్రకారం, మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఈ క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

  1. చిరునామా దృవీక‌ర‌ణ ప‌త్రం (రేష‌న్ కార్డు లేదా విద్యుత్ బిల్లు)

  2. నెఫ్ట్ వివ‌రాలు, క్యాన్సిల్ చేసిన చెక్

  3. ఒరిజిన‌ల్ పాల‌సీ డాక్యుమెంట్‌తో పాటు, కరోనావైరస్ వ్యాధి పాజిటివ్‌గా వ‌స్తే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా భారత ప్రభుత్వం నియమించిన ఇతర అధికారి నుంచి అసైన్‌మెంట్ ఎండార్స్‌మెంట్ స‌ర్టిఫికెట్ (ఏదైనా ఉంటే).

  4. ఆధార్, పాన్ ( ఒక‌వేళ బీమాతో అవి అనుసంధానం చేసి ఉంటే అవ‌స‌రం లేదు)
    5.హాస్పిటల్ బిల్లు , ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, వైద్యుల సంప్రదింపులు, సందర్శన ఛార్జీలు, వైద్య‌ వినియోగ వస్తువులు, మార్పిడి, గది అద్దె మొదలైన వాటి కోసం పెట్టిన బిల్లుల ర‌శీదు రెవెన్యూ స్టాంప‌తో ఉ న్న స్పష్టమైన బ్రేకప్‌లను పేర్కొనాలి. డబ్బు రశీదును రెవెన్యూ స్టాంప్‌తో సంతకం ఉన్న బిల్లుల‌ను స‌మ‌ర్పించాలి.

  5. లేబ‌రేట‌రీ, డ‌యాగ్న‌స్టిక్ టెస్ట్‌ రిపోర్టులు , ఎక్స్‌రే, ఈసీజీ, యూఎస్‌జీ, ఎంఆర్ఐ స్కాన్ వంటివి.

పాల‌సీ ప‌రిమితులు
ఆసుపత్రిలో చేరినప్పుడు కోవిడ్-19 చికిత్సకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. ఇది ముందుగా ఉన్న వ్యాదిని కవర్ చేయదు. 15 రోజుల వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది.

ఈ పాల‌సీ పరిమిత కాలానికి ఉంటుంది. ఫోన్‌పే కరోనా కేర్ బీమా పాలసీ కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే వ‌ర్తిస్తుంది.
ఇది కాకుండా, మీరు కింది పరిస్థితులలో కరోనావైరస్ బీమా పాలసీ పరిధిలో ఉండరు:

  1. మీరు గత 30 రోజుల్లో విదేశాలకు వెళ్లిన‌ట్ల‌యితే

  2. గత 30 రోజులలో భార‌త్‌లోని కరోనావైరస్ వ్యాప్తి చెందిన‌ నగరానికి ప్రయాణించినట్లయితే

  3. మీరు ఇప్పటికే ఆసుపత్రిలో చేరినట్లయితే ఈ పాల‌సీ వ‌ర్తించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని