జాతీయ పొదుపు పత్రాల (ఎన్ఎస్‌సీ) గురించి తెలుసుకోవాల్సిన 5 అంశాలు

ఎన్ఎస్‌సీలో డిపాజిట్ల‌పై ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం రూ.1.5లక్ష‌ల వరకు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.​​​​​​...​

Published : 19 Dec 2020 17:03 IST

ఎన్ఎస్‌సీలో డిపాజిట్ల‌పై ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం రూ.1.5లక్ష‌ల వరకు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.​​​​​​​

చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు వార్సికంగా 8 శాతంగా ఉంది.

పోస్టాఫీస్ జాతీయ పొదుపు ప‌త్రాల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 5 అంశాలు…
1.పథకానికి అర్హులు:
మేజ‌ర్లు వారి సొంత‌పేరుపై జాతీయ పొదుపు ప‌త్రాల‌ను కొనుగోలు చేసేందుకు అర్హులు. ప‌దేళ్లు దాటిన మైన‌ర్లు సంర‌క్ష‌కుడి పేరిట జాతీయ పొదుపు ప‌త్రాలు కొనుగోలుచేయ‌వ‌చ్చు.
2.కనిష్ఠ, గరిష్ఠ పెట్టుబడులు:
ఒక జాతీయ పొదుపు ప‌త్రం కొనుగోలుకు క‌నీసం రూ.100 పెట్టుబ‌డి పెట్టాలి. రూ.100, రూ.500, రూ.1000, రూ.10,000 డినామినేషన్లలో పత్రాలు ల‌భ్య‌మ‌వుతాయి. ఒక వ్య‌క్తి గ‌రిష్ఠంగా ఎన్ని ఎన్ఎస్‌సీ లైనా కొనుగోలు చేయ‌వ‌చ్చు.
3.కాలపరిమితి:
ఎన్ఎస్‌సి ప‌త్రాల కాల‌ప‌రిమితి 5ఏళ్లు ఉంటుంది.

  1. పన్ను మినహాయింపు:
    ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1.5లక్ష‌ల వరకు చేసే డిపాజిట్లకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
    వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లేదు.
    5.ఖాతా బదిలీ:
    ఒక వ్యక్తి మరొకరికి జాతీయ పొదుపు ప‌త్రాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీచేసుకునే వీలుంది . తక్కువ డినామినేషన్లు కలిగిన పత్రాలను ఎక్కువ డినామినేషన్ల పత్రాలుగా మార్చుకోవచ్చు. లేదా ఎక్కువ డినామినేషన్లవి తక్కువ వాటిగానూ మార్చుకునే సౌలభ్యం ఉంది.

జాతీయ పొదుపు పత్రాలు పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గంలా ఉపయోగపడతాయి. నెలనెలా క్రమంగా వీటిలో పెట్టుబడి పెడితే మరో ఐదేళ్లకో/ పదేళ్లకో అవి వృద్ధి చెంది నెలనెలా వడ్డీతో సహా పదవీ విరమణ కాలంలో ఆదాయం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని