Postal - IVR: ఐవీఆర్ సౌక‌ర్యం అందిస్తున్న పోస్టాఫీస్‌.. 

పోస్టల్ శాఖ అందించే ఐవీఆర్ స‌ర్వీస్ ద్వారా వివిధ సేవ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. 

Updated : 19 Oct 2021 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పోస్టల్‌ ఖాతాదారులు ఇంట‌రాక్టివ్‌ వాయిస్ రెస్పాన్స్‌ (ఐవీఆర్‌) ద్వారా పోస్టల్‌ సేవ‌ల‌ను వినియోగించుకోవచ్చని తెలుసా. త‌మ‌ సేవింగ్స్ బ్యాంక్‌ (పీఓఎస్‌బి) ఖాతాదారుల కోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ స‌దుపాయాన్ని అందిస్తోంది. ఐవీఆర్‌ సేవల  కోసం 18002666868 టోల్‌ఫ్రీ నెంబ‌రుకు డ‌య‌ల్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసు అందిస్తున్న‌ వివిధ పొదుపు ప‌థ‌కాల‌కు సంబంధించిన మొత్తం స‌మాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవ‌చ్చు. 

ఐవీఆర్ స‌దుపాయం ఎలా ప‌నిచేస్తుంది?

పొదుపు ఖాతాదారుల‌కు ఐవీఆర్ అనేక ఆప్ష‌న్‌ల‌ను అందిస్తోంది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరికొన్ని ప్రాంతీయ భాష‌ల్లో ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు తెలుగులో వివ‌రాలు తెలుసుకోవాల‌నుకుంటే టోల్‌ఫ్రీ నెంబ‌రుకు కాల్ చేసి 2ను క్లిక్‌ చేయాలి. భాష‌ను ఎంచుకున్న త‌రువాత భార‌తీయ పోస్ట‌ల్ సేవ‌ల‌కు మీకు స్వాగ‌తం స్వాగతం ప‌లుకుతారు. ఇక్క‌డ మీకు కావ‌ల‌సిన సేవ‌ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. పోస్టల్‌ సర్వీసుల డెలివరీ డెలివరీ స్థితి, రిజిస్ట‌ర్ పోస్ట్ సేవ‌లు, జీవిత బీమా ప్రీమియం గ‌డువు తేది, ప్రీమియం మొత్తం, పాల‌సీ స్థితి, పాల‌సీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్ సేవ‌లు అన్ని ప‌థ‌కాల ఖాతా బ్యాలెన్స్, డెబిట్ కార్డు సేవ‌లు, పోస్టాఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు తదితర వివరాలు ఐవీఆర్‌ ద్వారా పొందొచ్చు. ఏదైనా ఫిర్యాదులు చేయాల‌కున్నా క‌స్ట‌మ‌ర్ కేర్‌కు క‌నెక్ట్ చేయ‌డం చేసి ఫిర్యాదు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని