పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌పై వ‌డ్డీ రేట్లు, జ‌రిమానాలు

నాలుగు రెగ్యులర్ డిఫాల్ట్‌ల తర్వాత రెండు నెలల వరకు  ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయవచ్చు 

Published : 30 Mar 2021 16:07 IST

పోస్టాఫీస్‌ రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పెట్టుబడిదారులు ఎక్కువ‌గా మొగ్గుచూపే పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇందులో పెట్టుబడులకు ముందు సంబంధించిన జరిమానాలు, ఇతర వివరాలను తెలుసుకోవాలి.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ల‌పై  ప్రస్తుతం త్రైమాసికంలో 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ వడ్డీపై పూర్తిగా పన్ను వ‌ర్తిస్తుంది. త్రైమాసికంగా వడ్డీ స‌వ‌రింపు జ‌రుగుతుంది. ఇది ప్రభుత్వ మద్దతుగల పథకం. అందువల్ల, దీనిని సంప్రదాయవాద పెట్టుబడిదారులు ఇష్టపడతారు. అయితే, మీరు రిక‌రింగ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లయితే,  నెలవారీ వాయిదాలను స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే దానిపై వ‌ర్తించే జరిమానాలను కూడా తెలుసుకోవాలి.
కనీస నెలవారీ డిపాజిట్ రూ .100, ఆ తరువాత  రూ .10 గుణిజాలలో జమ చేయవచ్చు. ఒకవేళ నెల మొదటి 15 రోజుల్లో ఖాతా తెరిచినట్లయితే,  ఆ మొత్తాన్ని నెల‌లో మొద‌టి15 రోజుల్లో జమ చేయాలి. 15 త‌ర్వాత‌ ఖాతా తెరిస్తే ఆ మొత్తాన్ని నెల చివరి తేదీకి ముందు వ‌రకు జమ చేయాలి.

ఒకవేళ నిర్ణీత సమయంలో మొత్తాన్ని జమ చేయకపోతే, ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించి, డీయాక్టివేట్ అవుతుంది. ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయ‌డానికి  ప్రతి రూ .100 కి రూ.1 చెల్లించాలి, దాంతో పాటు అప్ప‌టివ‌ర‌కు చెల్లించాల్సిన‌ మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది.

నాలుగు సార్లు వ‌రుస‌గా స‌మ‌యానికి చెల్లించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, రెండు నెలల వ‌ర‌కు ఖాతాను తిరిగి యాక్టివేట్‌ చేయవచ్చు. ఈ వ్యవధిలో ఖాతా పునరుద్ధరించ‌క‌పోతే, అది నిలిపివేయబడుతుంది, తదుపరి డిపాజిట్ చేసేందుకు వీలుండ‌దు.

నాలుగు కంటే తక్కువ డిఫాల్ట్‌లు ఉంటే, ఖాతాదారుడు తన ఇష్టానుసారం మెచ్యూరిటీ వ్యవధిని  పొడిగించవచ్చు.

ఆర్‌డీపై వడ్డీతో క‌లిపి 2 శాతం అధిక వ‌డ్డీతో దీనిపై రుణం కూడా తీసుకోవచ్చు.  ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఆర్‌డీ ఖాతాను ముంద‌స్తుగా మూసివేయవచ్చు. ఈ స‌మ‌యంలో పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా వడ్డీ వ‌ర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని