Small savings scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు యథాతథం

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వ త్రైమాసికంగా స‌వ‌రిస్తుంది. 

Updated : 01 Oct 2021 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్టోబ‌ర్‌- డిసెంబ‌ర్ త్రైమాసికానికి గానూ ప‌బ్లిక్ ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ (ఎస్ఎస్‌వై) స‌హా పోస్టాఫీసు అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను య‌థాత‌థంగా కొన‌సాగిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. వివిధ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించ‌కుండా య‌థాత‌థంగా కొన‌సాగించ‌డం వరుసగా ఇది ఆరోసారి. ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాల వ‌డ్డీరేట్లను ప్రతి త్రైమాసికానికోసారి స‌వ‌రిస్తుంది.

పోస్టాఫీస్ ప‌థ‌కాలైన ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ (ఎస్ఎస్‌వై)తో పాటు ఇత‌ర ప‌థ‌కాల్లో సెప్టెంబ‌రు 30, 2021 వ‌ర‌కు చేరిన వారు ఎంత వ‌డ్డీ రేటు పొందారో.. అక్టోబ‌రు 1 నుంచి డిసెంబ‌రు 31 వ‌ర‌కు ఈ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్టిన వారు కూడా అదే వ‌డ్డీ రేటును పొందుతారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన స‌ర్క్యులర్‌ ప్ర‌కారం మూడో  త్రైమాసికంలోనూ ప‌బ్లిక్ ప్రావిండెండ్ ఫండ్‌ (పీపీఎఫ్‌) వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతంగానూ, జాతీయ పొదుపు ప‌త్రాల‌ (ఎన్ఎస్‌సీ) వార్షిక వ‌డ్డీ రేటు 6.8 శాతంగానూ కొన‌సాగనుంది. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వాటిలో పెట్టుబ‌డులు పెట్టిన వారితో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్టిన వారు ఎక్కువ రాబ‌డి పొందుతారు. పోస్టాఫీస్ ఐదేళ్ల ట‌ర్మ్ డిపాజిట్ 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తుండ‌గా, భార‌తీయ ప్ర‌ధాన బ్యాంకులు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.4-5.5 శాతం వడ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి. 

పోస్టాఫీస్ అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు - తాజా వ‌డ్డీరేట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని