పెట్టుబ‌డుల‌ రిస్క్ త‌గ్గించే వ్యూహాలు

కొంత రిస్క్ ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలతో , అధిక రాబడితో సంపద చేకూర్చుకోవచ్చు......

Published : 23 Dec 2020 15:49 IST

కొంత రిస్క్ ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలతో , అధిక రాబడితో సంపద చేకూర్చుకోవచ్చు

రిస్క్ తీసుకోగలిగి, మార్కెట్ హెచ్చుతగ్గులకు నిలబడగలిగితే, ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్, ఈక్విటీ ఫండ్స్ (గ్రోత్ / రంగాలలో ), ఫారెక్స్ , కమోడిటీ, డెరివేటివ్స్ లలో పెట్టుబడి చేయొచ్చు. కొంత రిస్క్ ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలతో , అధిక రాబడితో సంపద చేకూర్చుకోవచ్చు . ఈ సమయంలో మొత్తం మీద కొంత రిస్క్ తగ్గించుకోవచ్చు.

పెట్టుబడులలో వైవిధ్యం , రిస్క్-రిటర్న్ లో రాజీతో, ప్రతి సారీ కచ్చితమైన రాబడి లేకపోయినా , అసలుకు నష్టం వాటిల్లదు. ఈ మూడు ప్రాథ‌మిక‌ పెట్టుబడి సాధనాలైన ఈక్విటీ , డెట్ , మనీ మార్కెట్ గురించి తెలుసుకోవాలి . ఈక్విటీలు మార్కెట్ లో రోజువారీ హెచ్చుతగ్గులకు స్వల్పకాలంలో రిస్క్ ఉన్నా , దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రాబడి ఇస్తాయి .

బాండ్స్ స్వల్పకాలంలో అంత హెచ్చుతగ్గులకు లోనుకావు కాబట్టి, సురక్షితం. అదే దీర్ఘకాలంలో రాబడి తక్కువ . దీనివలన ద్రవ్యోల్బణం ప్రభావంతో అసలు నష్టపోయే అవకాశం వుంది . వడ్డీ రేట్లలో వచ్చే మార్పుల చేత , బాండ్స్ విలువలో మార్పులు వస్తాయి .ఈ మూడు పెట్టుబడులలో మనీ మార్కెట్ చాలా సురక్షితమైనప్ప‌టికీ, రాబడిలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేవు.

చర్య: ఈ మూడింటిలో - అధిక రిస్క్ గల ఈక్విటీ , మధ్యస్థ రిస్క్ గల బాండ్ , తక్కువ రిస్క్ గల మనీ మార్కెట్ లను తగుపాళ్లలో పెట్టుబడి చేయొచ్చు . మీ ఆర్ధిక లక్ష్యాలు, రిస్క్ సామర్ధ్యం ఆధారంగా పెట్టుబడి చేస్తారు కాబట్టి, ఒకే రకమైన సాధనంలో అధిక మొత్తంలో ఉండరాదు. అలాగే ఒకే రకమయిన కంపెనీలలో, రంగాలలో పెట్టుబడులను చేయరాదు . వృద్ధికి అవకాశం ఉన్న, స్థిరమైన లార్జ్ , మిడ్ , స్మాల్ కాప్ కంపెనీలలో పెట్టుబడి చేయాలి. వృద్ధికి అవకాశం ఉన్న ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ఎంచుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియో లో వేర్వేరు ఫండ్ హౌస్ లను, వాటి స్కీం లలో వివిధ రంగాలకు చెందిన ఫండ్స్ లను ఎంచుకోవాలి .

చర్య : ఆర్ధిక మదుపు సాధనాలైన ఈక్విటీ, డెట్ , మ్యూచువల్ ఫండ్స్ తోపాటు బంగారం, రియల్ ఎస్టేట్ లు వున్న వైవిధ్యభరితమైన పోర్ట్ ఫోలియో ను తయారు చేసుకోవాలి.

మార్కెట్లు చౌకగా ఉన్నప్పుడు కొనాలి, ఖరీదుగా ఉన్నప్పుడు అమ్మాలి - వారెన్ బఫెట్ . మార్కెట్లో హెచ్చుతగ్గులు సాధారణం. సిప్ ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం ఈక్విటీలకు కేటాయించడం వలన , బుల్ మార్కెట్ లో అధిక ధరలవలన తక్కువ యూనిట్లు, బేర్ మార్కెట్ లో తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్లు పొందొచ్చు.

చర్య : మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి లాభపడటానికి సిప్ పద్ధతిలో ఈక్విటీలలో ట్రేడింగ్ లేదా ఈక్విటీ మ్యూచువల్ఫండ్స్ లో పెట్ట్టుబడి చేయొచ్చు. మీ వయసు, జ్ఞానం , అనుభవం, నమ్మకాలు వంటి వాటిని గుర్తించి , మీ రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. యుక్త వయసులో అధిక బాధ్యతలు ఉండవు కాబట్టి , ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. కొంత వయసు వచ్చాక ఆర్ధిక లక్ష్యాలైన పిల్లల చదువులు, ఆరోగ్యం, పదవీవిరమణ) వంటి వాటిపై దృష్టి సారించాలి. పెరిగిన వయసు తో గడించిన అనుభవం, జ్ఞానం తో తగిన పోర్ట్ ఫోలియో ను తయారుచేసుకోవాలి.

చర్య: మీ రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి. మదుపరుడి ముఖ్య లక్షణం అతని/ ఆమె స్వభావం, తెలివి కాదు - వారెన్ బఫెట్ . అందరూ చేశారని కాకుండా, ఒక అడుగు వెనకకు వేసి , మీ రిస్క్ సామర్ధ్యానికి తగినట్లుగా ఉన్నదో లేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఐపీఓ , ఎన్ఎఫ్ఓ లలో మదుపు చేసే ముందు, మీ రిస్క్ సామర్ధ్యానికి సరిపోతాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే వీటికి
గత ఫలితాల వివరాలు ఉండవు. ఒక్కొక్కసారి షేర్ ధరలలో పెరుగుదల కనిపించవచ్చు. అయితే అది ఎక్కువకాలం నిలబడలేకపోవచ్చు. అందుచేత షేర్ల ధ‌ర‌ను పరిశీలించడం ముఖ్యం .

చర్య: దీర్ఘకాలం అంటే 10 ఏళ్లకు పెట్టుబడి చేయదలిస్తే, ద్రవ్యోల్బణాన్ని మించి , అలాగే బంగారం, రియల్ ఎస్టేట్ లకన్నా అధిక రాబడినిస్తాయి . వార్తలు, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు . విజయవంతమైన మదుపరులు అన్నీ ఆలోచించి రిస్క్ తీసుకుంటారు . బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ లాంటి సురక్షిత పెట్టుబడులు, ఎక్కువ సంపద చేకూర్చవు .
చర్య: షేర్లలో పెట్టుబడి చేసే ముందు ధరతోపాటు, ఆ కంపెనీ ఆర్ధిక స్థితిగతులు, ఆ రంగంలో ఆ కంపెనీ స్థానం వంటివి పరిగణించాలి . అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి .

క్రమానుగతంగా , అంటే నెలకు, 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి మీ ఫోలియో ను సమీక్ష చేసుకోవాలి . మీ లక్ష్యాలకు, తగినట్లుగా ఉన్నాయో లేదో, అలాగే కాలం వృద్ధిలేని వాటినుంచి బయటకు వచ్చి , మరొక పధకంలో పెట్టుబడి చేయాలి .

చివరి మాట: ఇది ఒక అవగాహన కొరకు మాత్రమే. ఇది పెట్టుబడి లేదా న్యాయ సలహా కాదు. ఈ విషయాలలో నిపుణుల
సలహా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని