హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో

నివాసాలకు అనుగుణంగా ప్లాట్ల (ఖాళీ స్థలాల)ను అభివృద్ధి చేసి, ఇచ్చే విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు స్థిరాస్తి సంస్థ పూర్వాంకరా లిమిటెడ్‌ ప్రకటించింది. వచ్చే 6-7 నెలల్లో రూ.825 కోట్ల పెట్టుబడితో 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ఆ సంస్థ

Published : 01 Mar 2021 00:40 IST

ప్లాట్ల వ్యాపారంలోకి పూర్వాంకర
రూ.825 కోట్లతో 6 ప్రాజెక్టులు

దిల్లీ: నివాసాలకు అనుగుణంగా ప్లాట్ల (ఖాళీ స్థలాల)ను అభివృద్ధి చేసి, ఇచ్చే విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు స్థిరాస్తి సంస్థ పూర్వాంకరా లిమిటెడ్‌ ప్రకటించింది. వచ్చే 6-7 నెలల్లో రూ.825 కోట్ల పెట్టుబడితో 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ ఆర్‌.పూర్వాంకర తెలిపారు. ప్లాట్ల వ్యాపారానికి ప్రత్యేకంగా బ్రాండ్‌, జట్టును ఏర్పాటు చేసి ‘పూర్వా ల్యాండ్‌’ పేరుతో కార్యకలాపాలు సాగిస్తామన్నారు. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌లలో 6 ప్రాజెక్టుల్లో 55 లక్షల చదరపు అడుగుల ప్లాట్లను విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పుణె, ముంబయి, హైదరాబాద్‌లలో కూడా భూ యజమానులతో చర్చలు కొనసాగుతున్నాయని, వారు అంగీకరిస్తే సంయుక్తంగా ప్లాట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని