ప్రీమియం పొదుపు ఖాతాలు
పొదుపు ఖాతా కలిగిన వారికి అదనపు సేవలు అందిస్తూ, బ్యాంకింగ్ లావాదీలను జరపడం మరింత సులభతరం చేసే ప్రీమియం పొదుపు ఖాతా వివరాలు..
పొదుపు ఖాతాలను దాదాపు ఉచితంగా లేదా ఆకర్షణీయమైన రాయితీలతో ఎక్కువ మంది వినియోగదారుల కోసం బ్యాంకులు అందిస్తున్నాయి. ఇంకో అడుగు ముందుకేస్తూ, ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపే, ఎక్కువ నిల్వ ఉంచే ఖాతా దారులకు అదనపు సౌకర్యాలు, రాయితీలు కల్పించే ఖాతాలను ప్రీమియం పొదుపు ఖాతాలంటారు. ఇలాంటి ఖాతాలకు అందించే ఉచిత సదుపాయాలేంటో చూద్దాం.
- ఈ ఖాతాల్లో సగటు కనీస నిల్వ రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ ఉండేలా చూసుకోవాలి. ఇది బ్యాంకు బ్రాంచి ఉండే ప్రదేశాన్ని(గ్రామం/పట్టణం/నగరం) బట్టి మారుతూ ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంకును బట్టి కూడా కనీస నిల్వ మారుతుంటుంది.
అదనపు సౌకర్యాలు, రాయిత్యీలు
ఉచిత చెక్కు బుక్కులు, ఏటీఎం కమ్ డెబిట్ కార్డులు, వార్షిక ఛార్జీలు లేకుండా ఉచిత క్రెడిట్ కార్డులను ప్రీమియం పొదుపు ఖాతా వినియోగదారులకు బ్యాంకులు జారీచేస్తాయి.
- ఇవే కాకుండా ఇంటర్నెట్/ ఫోన్ బ్యాంకింగ్/ ఎస్ఎంఎస్, ఆన్లైన్లో పన్ను చెల్లింపు, స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఛార్జీలు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్, ఈ మెయిల్ ద్వారా ఖాతా స్టేట్మెంట్, బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేస్తాయి.
- డూప్లికేట్ ఏటీఎం కార్డును 25 నుంచి 75శాతం రాయితీతో అందిస్తున్నారు.
- కొంత పరిమితితో బ్యాంకర్స్ చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్టులు ఇంకా ఆర్డీజీఎస్/నెఫ్ట్ సేవలను ఉచితంగా బ్యాంకులు అందిస్తున్నాయి.
- ఖాతా ఉన్న బ్రాంచీలో, లోకల్ లేదా అవుట్ స్టేషన్ బ్రాంచీల్లో నగదును ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు.
- ఖాతా ఉన్న బ్రాంచీలో ఉచిత నగదు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.
- లోకల్ లేదా ఇతర బ్రాంచీల్లో అయిదు లావాదేవీల వరకు ఉచితం.
- డీమ్యాట్ ఖాతా నిర్వహణ ఛార్జీలు − ఉచితంగా లేదా 75శాతం వరకు రాయితీతో కల్పిస్తారు.
- లాకర్ తీసుకుంటే, చార్జీలపై రాయితీ ఇస్తారు.
- కారు లేదా ఇంటి రుణంపై తీసుకునే ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు.
- కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొంత పరిమితుల మేరకు నగదు పికప్, హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తారు.
- కోరుకున్న బ్యాంకు సేవలను ప్రీమియం ఖాతాదారులకు విస్తరించే అవకాశం ఉంది.
- బ్యాంకు శాఖ ఉన్న ప్రదేశాన్ని బట్టి కనీస త్రైమాసిక సరాసరి నిల్వ ఉంచేందుకు రూ.200 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తారు.
- ఒక పరిమితి నిర్ధారించి, దానికన్నా ఎక్కువగా ఖాతాలో ఉన్న మొత్తాన్నిఫిక్స్డ్ డిపాజిట్లగా మళ్ళించి అదనపు వడ్డీ వచ్చేలా చేస్తారు. లావాదేవీలు జరిగేందుకు సరిపడే మొత్తం ఖాతాలో లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మొత్తాన్ని ఖాతాలోనికి మళ్ళిస్తారు. ఈ విధంగా ప్రీమియం పొదుపు ఖాతాలు స్వీప్ ఇన్ ఖాతాలుగా కూడా పని చేస్తాయి.
- ఈ సదుపాయాలన్నీ దాదాపు అన్ని బ్యాంకులు స్వల్ప తేడాలతో అందిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!