ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు కోల్‌ ఇండియా అనుబంధ సంస్థల సన్నాహాలు

కొవిడ్‌-19 చికిత్సలో కీలకమైన ప్రాణవాయువుకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు...

Updated : 28 Apr 2021 00:48 IST

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో కీలకమైన ప్రాణవాయువుకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు తమ 3 అనుబంధ సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు కోల్‌ ఇండియా వెల్లడించింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచుకోవడం ద్వారా ఉద్యోగులకు అధిక భద్రత కల్పించినట్లు, అన్ని అనుబంధ సంస్థల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 25కు ఐసీయూ, ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ తోడ్పాటు ఉన్న కొవిడ్‌ కేర్‌ బెడ్‌లతో కలిపి దాదాపు 2000 పడకలను సిద్ధం చేసినట్లు వివరించింది.

సిద్స్‌ ఫార్మ్‌ నుంచి పన్నీర్‌ ఉత్పత్తులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా పాల ఉత్పత్తులు అందుస్తున్న సిద్స్‌ ఫార్మ్‌ నేచురల్‌ పన్నీర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాలలో ఎలాంటి హార్మోన్లు, నిల్వ చేసే పదర్థాలను వాడకుండా దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో రూ.75వేల కోట్ల పన్నీర్‌ విపణిలోకి ప్రవేశిస్తున్నట్లు సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ కిశోర్‌ ఇందుకూరి తెలిపారు. తమ పన్నీర్‌ మృదువుగా, పలు పోషకాలతో ఉంటుందని వివరించారు. మూడు రోజుల్లో దీన్ని వినియోగించాల్సి ఉంటుందని, సహజంగా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని