GST: కొవిడ్‌ వస్తువులపై కుదరని ఏకాభిప్రాయం

కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో

Updated : 28 May 2021 20:45 IST

పన్నురేట్ల అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు

దిల్లీ: కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలి భేటీలో తీసుకున్న నిర్ణయాల వివరాలను వెల్లడించారు.

ఈ భేటీలో ముఖ్యంగా కొవిడ్‌ సంబంధిత వస్తువులపై పన్ను అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సీతారామన్‌ వెల్లడించారు. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. అలాగే, మినహాయింపు జాబితాలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్‌-బి ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని