BillDesk: పేయూ చేతికి బిల్‌డెస్క్‌.. ఒప్పంద విలువ ఎంతంటే..?

భారత్‌లో వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలను అందజేస్తున్న ప్రముఖ కంపెనీ బిల్‌ డెస్క్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ ప్రోసస్‌ ఎన్‌.వి కొనుగోలు చేసింది....

Published : 31 Aug 2021 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలను అందజేస్తున్న ప్రముఖ కంపెనీ బిల్‌డెస్క్‌ను ప్రముఖ కన్జ్యూమర్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీ ప్రోసస్‌ ఎన్‌.వి కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ 4.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.34.4 వేల కోట్లు). ఇప్పటికే భారత్‌లో ‘పేయూ’ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సేవలను అందజేస్తున్న ప్రోసస్‌కు ఇకపై బిల్‌డెస్క్‌ కూడా జతకానుంది. దీంతో భారత్‌లో ఏటా 400 కోట్ల లావాదేవీలను నిర్వహించే సామర్థ్యం తమకు రానుందని ప్రోసస్‌ వెల్లడించింది. ఈ ఇరు సంస్థల మధ్య ఒప్పందానికి ‘కాంపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

తాజా కొనుగోలుతో భారత్‌లో ప్రోసస్‌ పెట్టుబడులు 10 బిలియన్‌ డాలర్లను మించనున్నాయి. గతంలో సిట్రస్‌పే, పేసెన్స్‌, విబ్మోను ఈ సంస్థ కొనుగోలు చేసింది. పేమెంట్స్‌, ఫిన్‌టెక్‌ వ్యాపారానికే తమ తొలి ప్రాధాన్యమని ప్రోసస్‌ వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌ మార్కెట్‌పై తమ దృష్టి ఉందని స్పష్టం చేసింది. బిల్‌డెస్క్‌ను 2000 సంవత్సరంలో స్థాపించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.270 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని