
పొగాకుపై పన్ను పెంచండి.. జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి
హైదరాబాద్: ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి అన్ని పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచాలని వైద్యులు, ఆర్థికవేత్తలతో పాటు ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు జీఎస్టీ మండలిని కోరారు. సెప్టెంబర్ 17న జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్న నేపథ్యంలో తమ అభ్యర్థనను పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు. పొగాకు నుంచి వచ్చే ఈ పన్ను ఆదాయం కొవిడ్ మహమ్మారి వేళ ఉపయోగపడుతుందని, వ్యాక్సిన్లు, మూడో వేవ్ ఎదుర్కోవడానికి కావాల్సిన ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని వారు ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
కొవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం పడిందని వారు పేర్కొన్నారు. దీంతో పలు ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిందన్నారు. దేశం మూడో వేవ్‌కు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్సును పెంచాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నిర్ణయం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా పొగాకు సంబంధిత వ్యాధులను అరికట్టినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగదారుల జాబితాలో దేశం రెండో స్థానంలో ఉందని, ఏటా లక్షల సంఖ్యలో మరణిస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. దేశంలోని క్యాన్సర్లకు 27 శాతం పొగాకే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచడం ఉత్తమమైన ప్రతిపాదన అని, ఆదాయం పెంచడంతో పాటు యువతను పొగాకు దూరంగా ఉంచేందుకు ఉపకరిస్తుందని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భావనా ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
-
Politics News
Telangana News: నేడు హైదరాబాద్‌కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ
-
Movies News
Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా
-
Politics News
BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!