Q1 results: టాటా మోటార్స్‌ నష్టాలు రూ.4,451 కోట్లు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో నష్టాలు కాస్త తగ్గాయి. క్రితం సంత్సరం ఇదే త్రైమాసికంలో రూ.8,438 కోట్ల నష్టాలు రాగా.. ఈసారి అది రూ.4,451 కోట్లకు తగ్గింది....

Published : 26 Jul 2021 21:53 IST

ముంబయి: జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ నష్టాలు కాస్త తగ్గాయి. క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.8,438 కోట్ల నష్టం రాగా.. ఈసారి అది రూ.4,451 కోట్లకు తగ్గింది. అలాగే క్రితం త్రైమాసికంలో వాటిల్లిన రూ.7,605 కోట్ల నష్టంతో పోల్చినా ఈసారి నష్టాలు తగ్గుముఖం పట్టాయి.

వార్షిక ప్రాతిపదికన ఆదాయం మాత్రం 107.6 శాతం పెరిగి రూ.66,406 కోట్లకు చేరింది. కంపెనీ ఖజానాకు కీలకంగా మారిన జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌రోవర్‌ ఆదాయం 73.7 శాతం పెరగడం విశేషం. ఫలితాలకు ముందు ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు ధర 0.95 శాతం కుంగి రూ.292.75 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని