RBI: ఆర్‌బీఐకి 28,000-82,000 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలం కావాలి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అదనపు కార్యాలయ స్థలం కోసం చూస్తోంది.

Updated : 09 Aug 2021 11:17 IST

దక్షిణ ముంబయి, బాంద్రా కుర్లాలో 

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అదనపు కార్యాలయ స్థలం కోసం చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యాలయానికి (దక్షిణ ముంబయి) సమీపంలో లేదా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) ప్రాంతంలో 2,601-7,681 చదరపు మీటర్ల (28,000-82,000 చ.అడుగులు) కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు (ఆర్‌ఎఫ్‌పీ) ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐ కోరింది. ప్రధాన కార్యాలయానికి 1.5 కిలోమీటర్లలోపు ఈ అదనపు కార్యాలయం ఉండేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆసక్తి ఉన్న సంస్థలకు సూచించింది. ఒకవేళ విక్రయానికి ఎవరూ ముందుకు రాకపోతే, 30 ఏళ్ల కాలానికి లీజు (అద్దె) ప్రాతిపదికన వచ్చినా పరిశీలిస్తామని తెలిపింది. సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో గ్రేడ్‌ ఏ కార్యాయాల చదరపు అడుగు రూ.25,000-50,000 మధ్య ఉండగా, బీకేసీ ప్రాంతంలో రూ.45,000-65,000 మధ్య ఉన్నట్లు జేఎల్‌ఎల్‌ ఇండియా ప్రాంతీయ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ సింగ్‌ వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని