ఖాతాలో డెబిట్ అయిన‌ప్ప‌టీకీ, న‌గ‌దు చేతికి రాలేదా?

ఏటీఎమ్‌లో న‌గ‌దు విత్‌డ్రా చేసేప్పుడు ఒక్కోసారి ఖాతాలో న‌గ‌దు డెబిట్ అయిన‌ట్లు చూపిస్తుంది. కానీ ఏటీఎమ్ మిష‌న్ నుంచి డ‌బ్బు రాదు. అదేవిధంగా కార్డు ద్వారా లావాదేవీలు జ‌రిపే స‌మ‌యంలో ఖాతాదారుని కార్డు నుంచి న‌గ‌దు డెబిట్ అవుతుంది. కానీ ఆమొత్తం ల‌బ్ధిదారుని ఖాతాకు చేరదు. ఇలాంటివి ఖాతాదారులకు అప్పుడప్పుడు ఎదుర‌వుతూనే ..

Updated : 01 Jan 2021 19:38 IST

ఏటీఎమ్‌లో న‌గ‌దు విత్‌డ్రా చేసేప్పుడు ఒక్కోసారి ఖాతాలో న‌గ‌దు డెబిట్ అయిన‌ట్లు చూపిస్తుంది. కానీ ఏటీఎమ్ మిష‌న్ నుంచి డ‌బ్బు రాదు. అదేవిధంగా కార్డు ద్వారా లావాదేవీలు జ‌రిపే స‌మ‌యంలో ఖాతాదారుని కార్డు నుంచి న‌గ‌దు డెబిట్ అవుతుంది. కానీ ఆమొత్తం ల‌బ్ధిదారుని ఖాతాకు చేరదు. ఇలాంటివి ఖాతాదారులకు అప్పుడప్పుడు ఎదుర‌వుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు ఖాతాదారుల ప్ర‌యోజ‌నాల‌కు సంర‌క్షించేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త నియ‌మాల‌ను తీసుకొచ్చింది. విఫ‌ల‌మైన లావాదేవీల‌ను ట‌ర్న్ అరౌండ్ టైమ్‌(టీఏటీ) ప‌ద్ద‌తిలో ప‌రిష్క‌రించాలని తెలిపింది. వినియోగ‌దారుల ఫిర్యాదుల ప‌రిష్కారంలో జాప్యం జ‌రిగితే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని తెలుపుతూ, అందుకు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించింది.

క‌మ్యూనికేష‌న్ లింక్ వైఫ‌ల్యం, ఏటీఎమ్‌ల‌లో న‌గ‌దు లేక‌పోవ‌డం, సెక్ష‌న్ల స‌మ‌యం ముగియ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల సాధర‌ణంగా లావాదేవీలు విఫ‌లం అవుతుంటాయి. ఇలాంటి లావాదేవీల‌ను బ్యాంకులు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలి. ఒక‌వేళ గ‌డువు తేదీలోపుగా ప‌రిష్క‌రించ లేక‌పోతే, స‌మ‌స్య ప‌రిష్క‌రించేంత‌కు వ‌రకు న‌ష్ట‌ప‌రిహారంగా రోజుకు కొంత మొత్తాన్ని వినియోగ‌దారునికి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.

  1. విఫ‌లం అయిన ఏటీఎమ్ లావాదేవీలు: ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, వినియోగ‌దారుడు ఏటీఎమ్ వ‌ద్ద లావాదేవీలు నిర్వ‌హించిన‌ప్పుడు, ఖాతా నుంచి న‌గ‌దు డెబిట్ అయ్యి ఏటీఎమ్ నుంచి న‌గ‌దు రాక‌పోతే, లావాదేవీ జ‌రిగిన రోజు నుంచి 5 రోజులు(T+5 )లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి. ఒక‌వేళ T+5 రోజుల‌లో స‌మ‌స్య ప‌రిష్కారం చేయ‌క‌పోతే గ‌డువు ముగిసిన నాటి నుంచి న‌ష్ట‌ప‌రిహారంగా రోజుకు రూ.100 ఖాతాదారునికి చెల్లించాల్సి ఉంటుది.
    1. మైక్రో ఏటీఎమ్‌: ఈ కొత్త ఫ్రేమ్‌వ‌ర్క్ మైక్రో ఏటీఎమ్‌ల వ‌ద్ద విఫ‌ల‌మైన లావాదేవీల‌కు వ‌ర్తిస్తుంది. మైక్రో ఏటీఎమ్‌లు చూసేందుకు పాయింట్ ఆఫ్ సేల్ మిష‌న్‌లను పోలి ఉంటాయి. సాధార‌ణ ఏటీఎమ్‌ల మాదిరిగానే ప‌నిచేస్తాయి. వీటిలో న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రా వంటి బ్యాంకు ప్రాథ‌మిక లావాదేవీల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. బ‌యోమెట్రిక్ అథంకేష‌న్ ద్వారా కార్డు ర‌హితంగా ప‌నిచేస్తాయి. వీటిని బ్యాంకు ఏజెంట్‌లు, పోస్టాఫీసు సిబ్బంది ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.
  1. కార్డు నుంచి కార్డుకి: ఒక డెబిట్ కార్డు నుంచి మ‌రొక డెబిట్ కార్డుకు లావాదేవీలు జ‌రిపిన‌ప్పుడు, వినియోగ‌దారుని ఖాతా నుంచి డ‌బ్బు డెబిట్ అయ్యి, లబ్దిదారుని ఖాతాకు క్రెడిట్ కాక‌పోతే, లావాదేవీ జ‌రిగిన రోజు నుంచి ఒక‌రోజు(T + 1 )లో స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి. ఒక‌వేళ గ‌డువు లోపుగా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోయిన‌, ఖాతాలోకి డ‌బ్బు జ‌మ కాక‌పోయినా, T + 1 రోజుల త‌రువాత డ‌బ్బు క్రెడిట్ అయ్యేంత‌వ‌ర‌కు రోజుకు రూ.100 చొప్పున బ్యాంకులు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది.

4.దుకాణం వ‌ద్ద జ‌రిగే లావాదేవీలు(క్యాష్ పాయింట్ల‌తో స‌హా): కొనుగోలు దారుని ఖాతాలో డ‌బ్బు డెబిట్ అయ్యి, దుకాణ దారుని ఖాతాకు జ‌మ కాక‌పోతే, ఆ లావాదేవీల‌ను T + 5 రోజుల‌లో స్వ‌యం చాలకంగా ప‌రిష్క‌రించాలి. లేక‌పోతే గ‌డువు అనంత‌రం నుంచి రోజుకు రూ.100 న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది.

  1. ఇదే నియ‌మాలు కార్డు లేకుండా చేసే(సీఎన్‌పీ)లావాదేవీలు, ఇ-కామ‌ర్స్ లావాదేవీల‌కు వ‌ర్తిస్తాయి. అంతేకాకుండా ఐఎమ్‌పీఎస్ లావాదేవీలు విఫ‌ల‌మైన‌ప్పుడు T + 1 రోజుల‌లో స్వ‌యంచాల‌కంగా స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి. లేక‌పోతే గ‌డువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.100 న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని