Reliance Capital: రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ ప్రమోటర్‌గా ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌(ఆర్‌సీఎల్‌)పై దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)ని ప్రయోగించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది.....

Updated : 29 Nov 2021 19:47 IST

దివాలా పరిష్కార స్మృతి ప్రయోగానికి సిద్ధమైన రిజర్వు బ్యాంకు

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ ప్రమోటర్‌గా ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌(ఆర్‌సీఎల్‌)పై దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)ని ప్రయోగించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. అందులో భాగంగా నేడు కంపెనీ బోర్డును రద్దు చేసింది. ఆ స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగేశ్వర్‌ రావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. త్వరలో ఐబీసీ పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే దివాలా పరిష్కార ప్రక్రియ ప్రతినిధిగా ఓ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని కోరుతూ ముంబయి ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌)కి దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొంది. రుణాల చెల్లింపులు, గవర్నెన్స్‌లో లోపాలను సకాలంలో సరిదిద్దడంలో విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని