RBI: విడతల వారీగా ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీ..!

విడతల వారీగా  డిజిటల్‌ కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చేలాంటి వ్యూహంపై ఆర్‌బీఐ పనిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. భాజ

Published : 06 Dec 2021 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విడతల వారీగా  డిజిటల్‌ కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చే వ్యూహంపై ఆర్‌బీఐ పనిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. భాజపా ఎంపీ రాకేశ్‌ సింగ్‌ నేడు లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్‌ కరెన్సీల ప్రారంభాన్ని ప్రతిపాదిస్తుందా..? ఆ వివరాలు ఏమిటీ.. ? అవి సురక్షితమైనా అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. 

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేస్తుందని.. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్‌బీఐ నుంచి అక్టోబర్‌లోనే ప్రతిపాదన వచ్చిందని ఆర్థికశాఖ వెల్లడించింది. ఆర్బీఐ చట్టం-1934ను సవరించి బ్యాంక్‌ నోట్‌ అన్న నిర్వచనంలో డిజిటల్‌ కరెన్సీని కూడా చేర్చాల్సి ఉందన్నారు. 

‘‘ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విడతలవారీగా వినియోగంలోకి తెచ్చే వ్యూహంపై ఆర్‌బీఐ పనిచేస్తోంది. నగదు పై ఆధారపడటాన్ని ఇది బాగా తగ్గిస్తుంది. సెటిల్మెంట్‌ రిస్క్‌లు, లావాదేవీల ఖర్చులను తగ్గించేస్తుంది. ఇది నమ్మకమైన, పటిష్టమైన చట్టపరమైన చెల్లింపు ఆప్షన్‌ ’’అని ఆర్థిక శాఖ సమాధానంగా తెలియజేసింది.   
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని