బడ్జెట్‌పై కేంద్రానికి రాహుల్‌ సూచనలు

పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం, రైతాంగం, కార్మిక రంగానికి బడ్జెట్‌ 2021లో అండగా నిలవాలని సూచించారు......

Published : 01 Feb 2021 11:13 IST

దిల్లీ: పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం, రైతాంగం, కార్మిక రంగానికి బడ్జెట్‌ 2021లో అండగా నిలవాలని సూచించారు. అలాగే కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాల్ని రక్షించేలా వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని హితవు పలికారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి సైతం కేటాయింపులు పెంచాలని సూచించారు.

నల్లచొక్కాలతో కాంగ్రెస్‌ ఎంపీలు...

మరోవైపు పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటుకు నల్లచొక్కాలతో హాజరయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడంలో భాగంగానే వారు ఈ చర్యకు ఉపక్రమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు దిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి...

బడ్జెట్‌ ‘ట్యాబ్‌‌‌’తో నిర్మలమ్మ

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని