Range Rover: భారత్‌లోకి సరికొత్త రేంజ్‌రోవర్‌..!

ల్యాండర్‌ రోవర్‌ సంస్థ భారత్‌లోకి సరికొత్త రేంజి రోవర్‌ స్పోర్ట్స్‌ ఎస్‌వీఆర్‌ కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.19

Published : 29 Jun 2021 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ల్యాండ్‌ రోవర్‌ సంస్థ భారత్‌లోకి సరికొత్త రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ ఎస్‌వీఆర్‌ కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.19 కోట్లతో ప్రారంభమవుతుంది. ఈ కారు పూర్తిగా యూకేలో తయారై భారత్‌కు దిగుమతి అవుతుంది. ఈ కారు విడుదల సందర్భంగా జేఎల్‌ఆర్‌ ఇండియా  ప్రెసిడెంట్‌, ఎండీ రోహిత్‌ సూరి మాట్లాడుతూ ‘‘రేంజ్‌రోవర్‌ ఎస్‌వీఆర్‌లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. దీంతో మంచి పనితీరు, విలాసవంతమైన సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటిష్‌ ఇంజిన్‌ శక్తి, విలాసాల కలయికతో తయారైన ఈ కారును వినియోగదారులు కచ్చితంగా అభిమానిస్తారు’’ అని పేర్కొన్నారు.

రేంజ్‌ రోవర్‌ ఎస్‌వీఆర్‌లో 5.0 లీటర్‌ వీ8 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 567 బీహెచ్‌పీ శక్తిని,700 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 8స్పీడ్‌ టార్క్‌ కన్వర్టును ఇచ్చారు. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో అందుకొంటుంది. అత్యధికంగా గంటకు 280 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు. ఎటువంటి భౌగోళిక పరిస్థితుల్లో అయినా కారు మంచి పనితీరు కనబర్చేలా ఛాసిస్‌లో మార్పులు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారులో  సీట్లకు విండ్‌సోర్‌ లెదర్‌, 825 వాట్స్‌ 19 స్పీకర్‌ మెరిడీయన్‌ సరౌండింగ్‌ సౌండ్‌ సిస్టమ్‌ను అమర్చారు. కారు వెనుక ఎస్‌వీఆర్‌ బ్యాడ్జ్‌ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని