CBDC: డిజిటల్‌ కరెన్సీకి సవాళ్లివే: శక్తికాంత దాస్‌

త్వరలో సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ అందులో ఉన్న కీలక సమస్యలేంటో వివరించింది....

Published : 08 Dec 2021 18:51 IST

ముంబయి: త్వరలో సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ అందులో ఉన్న కీలక సమస్యలేంటో వివరించింది. సైబర్‌ భద్రత, డిజిటల్‌ మోసాలు సవాళ్లుగా నిలవనున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వీటిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్నేళ్ల క్రితం నకిలీ నోట్లపై ఎలా అయితే ఆందోళన వ్యక్తమైందో.. డిజిటల్‌ కరెన్సీ విషయంలోనూ అదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. పటిష్ఠ భద్రతా వ్యవస్థలతో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవి శంకర్‌ మాట్లాడుతూ.. రెండు రకాల సీబీడీసీలు ఉంటాయని తెలిపారు. ఒకటి హోల్‌సేల్‌ అయితే మరొకటి రిటైల్‌ అని పేర్కొన్నారు. హోల్‌సేల్‌పై ఇప్పటికే చాలా వరకు పని పూర్తయ్యిందని తెలిపారు. రిటైల్‌ను క్లిష్టమైందిగా అభివర్ణించిన ఆయన దీన్ని తీసుకురావడానికి మరింత సమయం పడుతుందన్నారు. 

వచ్చే ఏడాది తొలినాళ్లలో సీబీడీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని