ఆర్టీజీఎస్
బ్యాంకింగ్ లావాదేవీలు సులభంగా, వేగవంతంగా చేసేందుకు ఉపకరిస్తుంది ఆర్జీజీఎస్. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంటు( ఆర్టీజీఎస్)..
బ్యాంకు లావాదేవీలు వేగవంతంగా పూర్తిచేసేందుకు అవసరమయ్యే పద్ధతుల్లో ఆర్ టీ జీ ఎస్ ఒకటి. వినియోగదార్లు ఆన్ లైన్లో లేదా నేరుగా బ్యాంకు కు వెళ్లి ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఉండే లావాదేవీలు చేసేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తారు.కనీస మొత్తం రెండు లక్షలు అంతకంటే పైబడి న మొత్తాలకు ఈ విధానం వర్తిస్తుంది.
వేగవంతం ఎందుకంటే…
సాధారణంగా ఎన్ ఈ ఎఫ్ టీ లోలావాదేవీలు రోజులో కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే సెటిల్మెంటుకు వెళ్తాయి. ఆ సమయానికి ముందు వచ్చి న లావాదేవీలు కటాఫ్ సమయం వరకు వేచిఉంటాయి. నిర్ణీత సమయానికి తరువాత వచ్చిన లావాదేవీలు తరువాత జరిగే సెటిల్మెంటుకు వెళ్తాయి.
ఆర్టీజీఎస్ లో లావాదేవీలు దేనికది స్వతంత్రంగా సెటిల్మెంటుకు వెళ్తుంది. నెటింగ్ విధానం ఉండదు.
సులభంగా…
ఈ సదుపాయం వినియోగించడం చాలా సులభంగా ఉంటుంది. వినియోగదార్లుఆన్ లైన్ ద్వారా నెట్ బ్యాంకింగు కు వెళ్లి ఆర్టీజీఎస్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్లో బ్యాంకు కు వెళ్లి సంబంధిత వివరాలను అందచేయాలి.
ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు చేసేందుకు వినియోగదారుడు కింది వివరాలను బ్యాంకు సిబ్బందికి తెలియజేయాలి.
- చెల్లించాలనుకుంటున్న మొత్తం
- వినియోగదారుని బ్యాంకు ఖాతా సంఖ్య
- లభ్ధిదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ ఎస్సీ కోడ్
- బ్యాంకు పేరు , బ్రాంచి చిరునామా
బ్యాంకు పనిదినాల్లో
రిజర్వుబ్యాంకు పనివేళల ప్రకారం ఈ సదుపాయం సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం గం.9 నుంచి గం.16.30 వరకు ఉంటుంది.
శనివారం గం.9నుంచి గం.14.00వరకు ఉంటుంది. అయితే ఈ సమయం బ్యాంకులను బట్టి మారుతుంది. బ్యాంకులు వారి పనిగంటలు,తమ వినియోగదార్ల ను దృష్టిలో ఉంచుకుని సమయాలను నిర్ణయిస్తాయి.
రుసుములు
నగదు పొందే వినియోగదార్లకు ఎటువంటి రుసుం ఉండదు కానీ నగదు పంపే వినియోగదార్లకు స్వల్ప రుసుం వసూలుచేస్తారు.
రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరుకు రుసుం రూ.30కి మించకూడదు.
రూ.5లక్షల కంటే ఎక్కువ ఉంటే వాటిపైరుసుం రూ.55కి మించకూడదు.
ఫిర్యాదులుచేసేందుకు…
లావాదేవీలు సక్రమంగా పూర్తికాకుంటే బ్యాంకు బ్రాంచికు వెళ్లి సంప్రదించండి
కింది రిజర్వుబ్యాంకు చిరునామాకు కూడా మీఫిర్యాదులను పంపించవచ్చు
చీఫ్ జనరల్ మేనేజర్
భారతీయ రిజర్వు బ్యాంకు
కస్టమర్ సర్వీస్ శాఖ
1 అంతస్తు, అమర్ బిల్డింగ్, ఫోర్ట్
ముంబై - 400 001
లేదా cgmcsd@rbi.org.in కుఈమెయిల్ పంపండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు