ప్రమాదంలో పాలసీ పత్రాలు పోతే?
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా పాలసీ పత్రాలను పోగొట్టుకుంటే ఏం చేయాలి?
ఒక వ్యక్తికి అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఆ సంఘటన నుంచి అంత త్వరగా కోలువకోవడం కష్టమే. ఒకవేళ ప్రమాదంలో బీమా పాలసీ పత్రాలు కోల్పోతే తర్వాత ఏం చేయాలి? బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ, బాధిత కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీనికోసం ఏవీఐఆర్ఎస్(AVIRS) అనే ప్రత్యేక సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రమాదానికి గురైన వాహన బీమా సంస్థను గుర్తించవచ్చు. దీంతో ఆపదలో ఉన్న సమయంలో డబ్బు చేతికందేలా సహాయపడుతుంది. ఇందుకు ప్రమాదానికి గురైన వాహనం రిజిస్ర్టేషన్, ఇంజన్ నంబర్ ప్రమాదం జరిగిన ప్రాంతం, తేదీల వివరాలను అందించాలి.
అందించిన వివరాలు IIBI ఇన్సూరెన్స్ డేటాబేస్కు మ్యాప్ చేయబడతాయి, ఇవి సరిపోలితే ప్రమాద బాధితుడికి ఇ-మెయిల్ / ఎస్ఎమ్ఎస్ ద్వారా బీమా వివరాలు తెలియజేస్తారు. ఒక వేళ బాధితుడు ఇచ్చిన వివరాలు ఏ బీమా సంస్థతో సరిపోకపోతే నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ లేదా ఇ-మెయిల్ ద్వారా మూడు సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. తప్పుడు సమాచారంతో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు