రిక‌రింగ్ డిపాజిట్ అంటే?

క‌రింగ్ డిపాజిట్ ఒక ర‌క‌మైన ట‌ర్మ్ డిపాజిట్ వంటిది. ఈ ఖాతాను సుల‌భంగా చాలా సుల‌భంగా ప్రారంభించ‌వ‌చ్చు. కానీ భార‌త్‌లో దీనికి అంతగా ప్రాధాన్యం లేదు. రిక‌రింగ్ డిపాజిట్‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. దీని గురించి సాధార‌ణంగా అడిగే ప్ర‌శ్న‌లేంటో ఇప్పుడు చూద్ధాం...

Published : 16 Dec 2020 16:55 IST

క‌రింగ్ డిపాజిట్ ఒక ర‌క‌మైన ట‌ర్మ్ డిపాజిట్ వంటిది. ఈ ఖాతాను సుల‌భంగా చాలా సుల‌భంగా ప్రారంభించ‌వ‌చ్చు. కానీ భార‌త్‌లో దీనికి అంతగా ప్రాధాన్యం లేదు. రిక‌రింగ్ డిపాజిట్‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. దీని గురించి సాధార‌ణంగా అడిగే ప్ర‌శ్న‌లేంటో ఇప్పుడు చూద్ధాం.

  1. రిక‌రింగ్ డిపాజిట్లు ఎలా ప‌నిచేస్తాయి?
    నెల‌కు కొంత ఖ‌చ్చిత‌మైన న‌గ‌దుతో రిక‌రింగ్ డిపాజిట్‌లో పొదుపు చేయ‌వ‌ల‌సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత డిపాజిట్ చేసిన న‌గ‌దు తిరిగి వ‌స్తుంది. దీనితో పాటు డిపాజిట్ చేసేట‌ప్పుడు ఉన్న వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది.

  2. నామినేష‌న్ స‌దుపాయం ఉందా?
    రిక‌రింగ్ డిపాజిట్‌లో నామినేష‌న్ సదుపాయం ఉంది.

  1. డిపాజిట్‌పై వ‌డ్డీ నెల‌రోజుల‌కి ఇస్తారా? మూడునెల‌ల‌కా?
    వ‌డ్డీ మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత ఖాతా ముగిసినపుడు ఒకేసారి ల‌భిస్తుంది.

  2. కాల‌ప‌రిమితిని, వాయిదా తేదీల‌ను మార్చుకునే అవ‌కాశం ఉందా?
    ఒక‌సారి ఖాతా తెరిచిన త‌ర్వాత తేదీలు మార్పు చేసుకునే వీలుండ‌దు. అంత‌గా కావాల‌నుకుంటే వేరే ఖాతాను ప్రారంభించుకోవ‌చ్చు.

  3. రిక‌రింగ్ డిపాజిట్ కాల‌ప‌రిమితి ఎంత‌?
    క‌నీస కాల‌ప‌రిమితి ఆరు నెల‌లు. త‌ర్వాత 3 నెల‌ల చొప్పున గ‌రిష్ఠంగా 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కొన‌సాగించే అవ‌కాశం ఉంది.

  4. పాక్షిక చెల్లింపులు జ‌రిపే వీలుందా?
    పాక్షిక చెల్లింపుల‌కు అవ‌కాశం ఉండ‌దు.

  5. గ‌రిష్ఠంగా ఎంత డిపాజిట్‌తో ఖాతాను తెర‌వాలి?
    ఈ ఖ‌తాలో గ‌రిష్ఠంగా నెల‌కు రూ.14,99,900 తో వాయిదాలు చెల్లించుకోవ‌చ్చు.

  6. వాయిదాలు సరిగా చెల్లించ‌క‌పోతే ఏమ‌వుతుంది?
    వ‌రుస‌గా ఆరు నెల‌లు వాయిదాలు చెల్లించ‌క‌పోతే బ్యాంకుకు ఖాతాను మూసేసే అధికారం ఉంటుంది. గ‌డువు ముగియ‌క ముందు ఉపసంహ‌రించుకునే ఖాతాల‌కు చెల్లించే వ‌డ్డీ రేట్ల‌ను వీటికి వ‌ర్తింప‌జేస్తారు.

  7. ఒకే సారి ఒక‌టి కంటే ఎక్కువ వాయిదాలు క‌ట్ట‌వ‌చ్చా?
    చెల్లించ‌వ‌చ్చు. కానీ అద‌నంగా చెల్లించ‌న దానికి ఎలాంటి వ‌డ్డీ రేట్లు వ‌ర్తించ‌వు.

  8. మెచ్యూరిటీ ముగియ‌క ముందు న‌గ‌దు తీసుకుంటే వడ్డీ రేట్లు ఎలా లెక్కిస్తారు?
    ముందు న‌గదు ఉపసంహ‌ర‌ణ చేసుకుంటే బ్యాంక్ బేస్ రేటు కంటే త‌క్కువ‌గా వ‌డ్డీ వ‌స్తుంది.

  9. మెచ్యూరిటీ కంటే ముందు న‌గ‌దును తీసుకోవ‌చ్చా?
    ఇందులో పాక్షిక చెల్లింపుల‌కు అవ‌కాశం ఉండ‌దు. కానీ న‌గ‌దు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ఖాతాదారుల అందరి సంత‌కాలు అవ‌స‌రం అవుతాయి. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా తీసుకోవ‌చ్చు.

  10. ఉమ్మ‌డి ఖాతాను తీసుకునే అవ‌కాశం ఉందా?
    రిక్‌రింగ్ డిపాజిట్‌లో ఉమ్మ‌డి ఖాతాను ప్రారంభించే అవ‌కాశం ఉంటుంది.

  11. మైన‌ర్‌కు రిక‌రింగ్ డిపాజిట్ అవ‌కాశం ఉందా?
    అవును. ఇందులో మైన‌ర్ కూడా ఖాతా తెరిచే అవ‌కాశం ఉంటుంది.

  12. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఏమైనా అద‌న‌పు ప్ర‌యోజ‌నాలున్నాయా?
    సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.25%-0.50% వ‌డ్డీ అద‌నంగా ల‌భిస్తుంది.
     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు