Reliance: ఏజీఎం తేదీ ఫిక్స్‌.. కీలక ప్రకటనలివే?

అన్ని కార్పొరేట్‌ కంపెనీల వార్షిక సాధారణ సమావేశాల (ఏజీఎం)తో పోలిస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ది భిన్నం. ఏటా ఈ కంపెనీ నుంచి కొన్ని కొత్త ప్రకటనలు వస్తుంటాయి..

Published : 02 Jun 2021 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని కార్పొరేట్‌ కంపెనీల వార్షిక సాధారణ సమావేశాల (ఏజీఎం)తో పోలిస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ది భిన్నం. ఏటా ఈ కంపెనీ నుంచి కొన్ని కొత్త ప్రకటనలు వస్తుంటాయి. దీంతో రిలయన్స్‌ ఏజీఎంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జియో నెట్‌వర్క్‌, జియో ఫోన్‌ ప్రకటనల తర్వాత ఏటా నిర్వహిస్తున్న ఏజీఎంపై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. మరోసారి అలాంటి అంచనాలతోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ ఏజీఎంకు సిద్ధమవుతోంది. జూన్‌ 24న ఈ సమావేశం వర్చువల్‌గా జరగనుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఎక్ఛ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సాధారణ ప్రజలు సైతం యూట్యూబ్‌లో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఏజీఎంకు ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉంది. ఈలోపే ఫలానా ప్రకటనలు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవలపై గురించి చర్చ జరుగుతున్న వేళ ఆ మేరకు కంపెనీ నుంచి కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ఫోన్‌తో సంచలనం సృష్టించగా.. 5జీ ఫోన్‌ తీసుకురానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. చౌక ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే విషయంలో ఇప్పటికే గూగుల్‌తో జియో జట్టు కట్టింది. దీంతో 5జీ ఫోన్‌కు సంబంధించిన ప్రకటన ఈ ఏజీఎంలో ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే 5జీ సేవలకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు జియో ఫోన్‌ మాదిరి జియో ల్యాప్‌టాప్‌ కూడా వస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. జియో బుక్‌ పేరిట తక్కువ ధరకే దీన్ని తీసుకొస్తారని తెలుస్తోంది. అధికారికంగా ఏమేం వెలువడతాయో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే!

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని