Published : 04 Jan 2022 18:52 IST

Reliance Jio: రూ. 5000 కోట్ల బాండ్లు విక్రయించనున్న జియో..?

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లోనే అతిపెద్ద మొబైల్‌ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ జియో మరోసారి బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి భారీ మొత్తంలో రూ.5 వేల కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించనుంది.  ఈ బాండ్ల మెచ్యూరిటీ పిరియడ్‌ 5 సంవత్సరాలు కాగా.. వీటిపై 6.20శాతం విలువైన కూపన్స్‌ ఇవ్వనున్నట్లు ఓ ఆంగ్లపత్రికలో కథనం వెలువడింది. ఈ మార్గంలో సమీకరించిన నిధులను చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్సింగ్‌కు వినియోగించనుంది. జియో చివరిసారిగా 2018లో బాండ్‌మార్కెట్‌ను ఉపయోగించుకొంది. 

2016లో వైర్‌లెస్‌ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన జియో చాలా వేగంగా నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకొంది. జియో పోటీకి చాలా టెలికమ్‌ సంస్థలు తట్టుకోలేకపోయాయి. ఓ పక్క మార్కెట్లోని అదనపు నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్న సమయంలో జియో ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ఏడాది జియో భారత్‌లో 5జీ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని